ప్రస్తుతం నందమూరి నటసింహ బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవల వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. యంగ్ హీరోలతో పోటీపడి మరీ నటిస్తున్నారు. ఇంకా యంగ్ హీరోలను మించి లైనప్ ఫ్యూచర్ సినిమాలను డిక్లేర్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే గోపిచంద్ మలినేని తో NBK107 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమాకు బాలయ్య ఓకే చెప్పారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి చెప్పిన టైటిల్ ను బాలయ్య రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది మరి.. ఆ సినిమా ఎంటి? ఈ ఆవివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
మాస్ హీరో బాలయ్య, మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమా కథ తండ్రి కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. ఈసినిమాలో బాలయ్య 45 ఏళ్ల తండ్రి పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు టాక్. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నారు. అయితే ఈసినిమా పూర్తి కాగానే.. వెంటనే అనిల్ రావిపూడి సినిమా సెట్ లోకి బాలయ్య అడుపెడతానని అన్నారంట. అయితే బాలయ్య మ్యానరిజానికి తగ్గట్టే.. పూర్తి బౌండెడ్ స్క్రీప్ట్ ను రెడీ చేస్తున్నారు అనిల్ రావిపూడి. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు కావాల్సిన ఏర్పాట్లును కూడా దగ్గరుండి చూసుకుంటున్నారట.
ఇక ఈ క్రమంలోనే.. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న NBK 108 పేరు “బ్రో ఐడోంట్ కేర్” అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులకి కూడా ఈ టైటిల్ తెగ నచ్చేసింది. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా పేరు బాలయ్యకు నచ్చలేదు. తండ్రి కూతుళ్ల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆ పేరు సూట్ కాదని బాలకృష్ణ భావించారంట. ఇదే విషయా అనిల్ కి తెలిపినట్లు ఇండస్ట్రీ టాక్ .దీంతో అనిల్ మరో టైటిల్ కోసం ఆలోచనలో పడ్డారంట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగవైరల్ అవుతోంది. మరి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టైటిల్ మార్పు వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆరోజు నుంచి షూటింగ్స్ బంద్!
ఇది చదవండి: Venu Swamy: నరేష్ అతని మూడో భార్య విడిపోతారని నాకు ముందే తెలుసు: వేణు స్వామి
ఇదీ చదవండి: Noel Sean: సింగర్ నోయల్ ఇంట తీవ్ర విషాదం!