ఈ రోజుల్లో సెలబ్రిటీ పెళ్లి అనగానే ముందుగా.. వారు ఎంచుకునేది డెస్టినేషన్ వెడ్డింగే. స్వంత ప్రాంతాలకు దూరంగా.. కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు,స్నేహితులు మధ్య వివాహాలు చేసుకుంటున్నారు. దీని కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. దుస్తులు నుంచి.. రిసెప్షన్ వరకు డబ్బులు భారీగా వినియోగిస్తుంటారు.
సామాన్యుల పెళ్లిళ్లు అయితే అంత వార్త కాదు కానీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు ఎప్పుడూ విశేషమే. అందులోనూ నేటి రోజుల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ స్వంత ప్రాంతాలకు దూరంగా.. కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు,స్నేహితులు మధ్య వివాహాలు చేసుకుంటున్నారు. దీని కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. దుస్తులు నుంచి.. రిసెప్షన్ వరకు డబ్బులు భారీగా వినియోగిస్తుంటారు. రాజస్తాన్, జైపూర్ కోటలు, లేదా గోవా, విదేశాల్లో ఖరీదైన ప్రాంతాల్లో వివాహ వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రియాంక చోప్రా నుంచి రేపటి శర్వానంద్ వరకు అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ వైపు వెళ్లిన వారే.. చూస్తున్నవారే. అయితే ఓ హీరోయిన్ మాత్రం కేవలం రూ. 2 లక్షల్లోపే పెళ్లి తంతును ముగించిందంటే నమ్ముతారా.. ఆశ్చర్యం అనిపించినా మింగుడు పడలేనంత నిజం.
ఇంత నిరాడంబరంగా పెళ్లి చేసుకన్న ఆ హీరోయిన్ ఎవరంటే..? మహేష్ బాబు, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన ఏకైక సినిమా అతిధి. ఈ సినిమాలో హీరోయిన్ గుర్తుండా.. అదేనండి అమృతరావు. ఆ నటే.. తన పెళ్లికి కేవలం రెండు లక్షల్లోపే ఖర్చు పెట్టిందట. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినప్పటికీ.. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. 2016లో ఆర్జే అన్మోల్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ చిన్నది. అయితే ఆమె పెళ్లికి అయిన ఖర్చు ఎంతో తెలుసా.. కేవలం రూ. 1.5 లక్షలేనని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. పెళ్లి బట్టలు దగ్గర నుండి కల్యాణ వేదిక, వచ్చిన అతిధులకు భోజనాలన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతోనే ప్లాన్ వేచేసుకున్నామని తెలిపారు.
అమృత రావు పెళ్లిలో ధరించిన పెళ్లి ఖరీదు చీర కేవలం రూ .3000 రూపాయలే నట. ఇక కళ్యాణమండపానికి రూ .11వేల రూపాయలు అన్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం పెళ్లి, రిసెప్పన్, పెళ్లి తర్వాత పార్టీల పేరుతో నటీనటులు ఇస్తున్న వేడుకలకు కోట్లు ఖర్చు పెడుతుంటే.. ఈ నటి మాత్రం నిరాంబరంగా పెళ్లి చేసుకుంది.సామాన్యుల పెళ్లిలో అది సింపుల్‌గా చేసుకుంటేనే సుమారు 10 లక్షలు ఖర్చు అవుతున్న తరుణంలో కేవలం లక్షన్నరలో పెళ్లి చేసుకుందంటే.. గ్రేట్ అనకుండా ఉండలేం.