ప్రస్తుతం ప్రపంచ చిత్ర పరిశ్రమలో మారుమ్రోగుతున్న పేరు RRR. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నాయి. ఇక ఈ చిత్రం గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా పలు అవార్డులను కొల్లగొడుతూ దూసుకెళ్తోంది. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదీకాక ఆస్కార్ ఒరిజినల్ సాంగ్స్ నామినేషన్స్ లో నాటు నాటు పాట షార్ట్ లిస్ట్ అయిన విషయం కూడా మనకు విదితమే. ఈ ఘనతలతో పాటుగా మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది RRR. ఈ అవార్డును ఏకంగా అవతార్ 2 సినిమాని వెనక్కి నెట్టి సాధించడం విశేషం. మరిన్ని వివరాల్లోకి వెళితె..
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ.. కలెక్షన పరంగా దాదాపు 1200 కోట్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక కలెక్షన్లే కాకుండా అంతకు మించి పలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటుగా ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది జక్కన్న తీసిన చిత్రం. తాజాగా ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డు చేరింది. అయితే ఈ అవార్డు ఎంతో ప్రత్యేకమైనది.
ఎందుకంటే? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 2 సినిమాను వెనక్కి నెట్టి ఈ అవార్డును కైవసం చేసుకుంది RRR.రోటెన్ టోమాటోస్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రతీ ఏడాది ఫ్యాన్స్ ఫేవరెట్ చిత్రాలను ప్రకటిస్తుంది. 2022 సంవత్సరానికి గాను ఈ ఏడాది అత్యధిక ఫ్యాన్స్ ఓటింగ్ తో అగ్రస్థానంలో నిలిచింది టాలీవుడ్ చిత్రం RRR. దాంతో ఈ ఏడాది గోల్డెన్ టమోటో అవార్డుకు ఎంపికైంది ఆర్ఆర్ఆర్ చిత్రం. హాలీవుడ్ చిత్రాలు అయిన అవతార్ 2: దివే ఆఫ్ వాటర్, టాప్ గన్, బ్యాట్ మెన్ లాంటి సినిమాలను వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే అవతార్ 2, ది బ్యాట్ మెన్, టాప్ గన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ వంటి చిత్రాలతో పాటుగా RRR సినిమాకు జనవరి 12న ఓటింగ్ చేపట్టారు. తొలి వారంలో కాస్త తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్.. రెండో వారంలో విజృంభించింది. అన్ని సినిమాల కంటే అత్యధిక ఓట్లు సంపాదించుకుని అగ్రస్థానంలో నిలిచింది. దాంతో గోల్డెన్ టమోటో అవార్డు దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాతి స్థానాల్లో టాప్ గన్, ఆస్కార్ కు 11 విభాగాల్లో నామినేట్ అయిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ది బ్యాట్ మెన్, అవతార్2 చిత్రాలు నిలిచాయి. మరి ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Our fans voted #RRR as the #GoldenTomato Award winner for Fan Favorite Movie of 2022! https://t.co/gSJnmq1buz pic.twitter.com/tHtk5q4dn4
— Rotten Tomatoes (@RottenTomatoes) January 30, 2023