మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. థియేటర్లలో RRR ట్రైలర్ రిలీజ్ అయింది. గురువారం ఉదయం 10 గంటలకు రిలీజ్‌అయిన ట్రైలర్ ఫ్యాన్స్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ట్రైలర్‌లో హైలెట్ సీన్లు ఫ్యాన్స్ మతిపోగొడుతున్నాయి. రామ్‌చరణ్ అల్లురి సీతారామరాజు లుక్ అయితే ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ పులి సీన్ గుస్‌బమ్స్ తెపిస్తుంది. మరోసారి జక్కన్న తనమార్క్‌ను చూపించారు. మరి ఈ ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.