అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. 2022 సంక్రాంతి బరిలో విడుదలకు ఆర్ఆర్ఆర్ రెడీ అవుతుండగా.. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది చిత్రబృందం. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో చిత్రయూనిట్ పాల్గొని సినిమా విషయాలతో పాటు.. షూటంగ్ సమయంలో జరిగిన సరదా విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న చిత్రబృందం పాల్గొంది. అయితే రాజమౌళి మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ పక్కనుండి రాజమౌళిని గిల్లాడు. వెంటనే రాజమౌళి ఉలిక్కిపడి లేచి నిలబడి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ.. ‘షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. షూటింగ్ దాదాపు 300 రోజులు జరిగింది. అయితే, వీరిద్దరి మూలంగా అందులో దాదాపు 25 రోజులు వృథా అయిపోయాయి. ఇద్దరికీ 30 ఏళ్లకు పైగా వయసు వచ్చింది. ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. కోట్లలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నా మీ కోసం చచ్చిపోతాం అనే ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
Moment of the day 🤣 pic.twitter.com/1FROYeVjj0
— 🧣🔥 Devdas 🌊 🦇 (@DevDTweetz) December 11, 2021
కానీ సెట్లో ఎప్పుడు చూసినా ఇద్దరూ గొడవ పడుతుండేవారు. ఆ టైంలో ఎన్టీఆర్ నా దగ్గరకు వచ్చి.. ‘జక్కన్నా, చరణ్ నన్ను గిల్లాడు’ అనేవాడు. వెంటనే చరణ్ వచ్చి అమాయకంగా.. ‘నేనా.. ఎప్పుడు గిల్లాను?’ స్క్రిప్ట్ లోని లైన్లు చదువుకుంటున్నా’ అనేవాడు. ఇలా ఎప్పుడూ సెట్లో సరదాగా గొడవ పడేవారు” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. వెంటనే సమావేశంలో పాల్గొన్న వారంతా సరదాగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ సరదా వీడియో పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.