RRR Official Twitter Page: దేశ వ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందిరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా సక్సెస్ సాధించటానికి రాజమౌళి దర్శకత్వం, రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ నటనలతో పాటు ప్రమోషన్ కూడా ముఖ్య కారణం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం సినిమా షూటింగ్ మొదలైనప్పటినుంచి ఏదో ఒక విధంగా సినిమాను ప్రమోట్ చేస్తూనే వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అన్న టైటిల్ ఖరారు చేసిన తర్వాత.. ఆ పేరు మీద ఆఫిషియల్ ట్విటర్ అకౌంట్ ఒకటి నెటిజన్లకు అందుబాటులోకి వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీం సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆ అకౌంట్ ద్వారా నెటిజన్లతో పంచుకుంటూ వచ్చింది.
నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. సందేహాలను తీర్చింది. సినిమా విడుదలైన తర్వాత అప్‌డేట్లు తగ్గిపోయాయి. కానీ, ట్విటర్ పేజీ మాత్రం ఇంకా యాక్టీవ్‌గా ఉంది. గత కొద్దిరోజుల నుంచి నెటిజన్ల ప్రశ్నలకు కొంచెం ఫన్నీగా సమాధానాలు ఇస్తూ వస్తోంది. తాజాగా, ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ ట్విటర్ ఖాతా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. ఆ సమాధానం ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ఇన్‌వాల్వ్ చేయటంతో వివాదానికి దారి తీసేలా ఉంది.
ప్రొఫెసర్ అనే ట్విటర్ ఖాతాదారుడు ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ ట్విటర్ ఖాతాను ఉద్ధేశిస్తూ.. ‘‘ అకౌంట్ అమ్ముతావా మావా’’ అని అడిగాడు. అందుకు ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ ట్విటర్ ఖాతా సమాధానం ఇస్తూ.. ‘‘ నీ డీపీలో ఉన్న అతడ్ని అడుగు.. కొట్టేయడానికి ఏదైనా ప్లాన్ వేస్తాడేమో’’ అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చింది. అయితే, సదరు ప్రొఫెసర్ ట్విటర్ ఖాతాదారుడి డీపీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండటం గమనార్హం. అయితే, ఈ ట్వీట్‌ను ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ ట్విటర్ ఖాతా డిలేట్ చేసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jabardasth Faima: ఫైమా టాలెంట్ మామూలుగా లేదు. పళ్లతో ఈ సారి ఏకంగా స్కూటీనే ఎత్తింది
Deyyy @RRRMovie Antha Maata Annav Yentra Rey 😂🤭 pic.twitter.com/cXJcOVq7Ve
— power ⭐ (@PowerStar_i) May 22, 2022