ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఒకటి. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి రూపొందించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ స్టార్స్ రాంచరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.
అయితే.. ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ట్రైలర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇదిలా ఉండగా.. తాజాగా RRR సినిమా టీమ్ కి సంబంధించి రెమ్యూనరేషన్స్ గురించి సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేయగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకోసం రాంచరణ్ – ఎన్టీఆర్ ఇద్దరూ కూడా దాదాపు 45 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ 25 కోట్లు, అలియా భట్ 9 కోట్లు అందుకున్నట్లు టాక్. ఇక డైరెక్టర్ రాజమౌళి ఏకంగా సినిమా లాభాల్లో 30% రెమ్యూనరేషన్ గా డీల్ కుదుర్చుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఆర్ఆర్ఆర్ బడ్జెట్ లో సగం వరకు రెమ్యూనరేషన్స్ కే నిర్మాత చెల్లించాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరి ఆర్ఆర్ఆర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.