దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపులార్ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. రూ.550 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1,127 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నట విశ్వరూపానికి ట్రిపులార్ సినిమా ఓ నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ సినిమా దాదాపు నెల రోజుల పాటు ఏ మాత్రం తగ్గకుండా థియేటర్ల వద్ద ప్రేక్షకులు సందడి చేశారు. అయితే ఇంక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. ఆ సమయం కూడా దగ్గర పడిందనే చెబుతున్నారు మేకర్స్. అయితే ఇక్కడ ఓ తిరకాసు పెట్టారు. ఈ సినిమాని ఓటీటీలో ఫ్రీ గా చూసేందుకు కుదరదంట. చూసేందుకు డబ్బు చెల్లించాలని చెబుతున్నారు.
ఇదీ చదవండి: యాంకర్ సుమకి ప్రమాదం! వైరల్ అవుతున్న వీడియో!
అదేంటంటే.. ఓటీటీ వచ్చాక పే పర్ వ్యూ అనే కాన్సెప్ట్ ని కూడా పరిచయం చేశారు. అంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా కానీ, సినిమా చూడాలంటే డబ్బు చెల్లించాలి. అయితే ఈ కాన్సెప్ట్ లాక్ డౌన్ టైమ్ లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ, అది నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలకు అలా చేశారు. ఒకసారి థియేటర్లో విడుదలైన సినమాను ఓటీటీలో చూడాలంటే డబ్బు చెల్లించమని కోరడం ఇదే తొలిసారి. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్న వాళ్లంతా మొదట అంతా ఈ సినిమా ఓటీటీలో ఫ్రీగా చూడచ్చులే అనుకున్నారు. జీ5 కూడా సినిమాని కొనుగోలు చేసిన సమయంలో పే పర్ వ్యూ పెట్టాలి అనే ఉద్దేశంలో లేరని చెబుతున్నారు. కానీ, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు కాబట్టి ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఓటీటీలో ప్రతిసారి చూసేందుకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదులెండి. విడుదలైన మొదటి పది రోజుల వరకు మాత్రం పే పర్ వ్యూ పద్ధతి ఉంటుందని చెబుతున్నారు. ఇంక ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5, నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. మే 20న ట్రిపులార్ సినిమా జీ5లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మే 20 నుంచి మే నెలాఖరు వరకు జీ5లో ట్రిపులార్ సినిమా చూడాలంటే డబ్బు చెల్లించాలని తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఓటీటీలో పే పర్ వ్యూ పద్ధతి కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.