ఇద్దరు సూపర్ స్టార్లు.. వారితో సమానంగా పోటీ పడేలా అందం, అభినయం కలిసిన తార.. మరేందరో మేటి నటులు, వీరందరిని తనకు కావాల్సిన విధంగా మలుచుకుంటూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం.. RRR. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే సూపర్‌హిట్ టాక్ అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నింటిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మానియా కనిపిస్తోంది. RRR కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి సమ ప్రధాన్యం ఉంటుందని దర్శకుడు రాజమౌళి ముందునుంచి చెప్తున్నట్లుగానే సినిమాలో కూడా అలానే ఉందట. ఈ క్రమంలో ప్రముఖ సినీ విమర్శకుడు, ఓవర్సీస్ సెన్సార్‌బోర్డ్ మెంబర్ ఉమైన్ సంధు RRRపై చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
ఇది కూడా చదవండి: అలియా కోసం థియేటర్ మొత్తం బుక్ చేసుకున్న పాక్ నటుడు!
RRR సినిమా అనేది ఓ అద్భుతం అని చెప్పిన ఉమైన్ సంధు.. చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పోటీ పడి నటించారని తెలిపారు. ఇద్దరూ హీరోలు కూడా కూడా తమ కెరీర్ బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ RRR లో ఇచ్చారని తెలిపారు. అయితే ఇది ఎన్టీఆర్‌కి గేమ్ ఛేంజర్ సినిమా అవుతుందని, ఆయనకు జాతీయ అవార్డు తప్పకుండా వస్తుందని అని పేర్కొన్నారు. రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబర్చారని, 2022 బెస్ట్ సినిమా ఇదేనంటూ RRRపై ప్రశంసలు గుప్పిస్తూ వరుస ట్వీట్స్ చేశారు ఉమైన్ సంధు.
#RRR will be Game Changer for #JrNTR. National Award is waiting for him. 🧿🙏
— Umair Sandhu (@UmairSandu) March 24, 2022
ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమా ఎందుకు చూడాలంటే..?
అంతకుముందే ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇచ్చిన ఉమైన్ సంధు.. RRR మైండ్ బ్లోయింగ్ అని, ఎన్టీఆర్ నటన ఫైర్ అని తెలిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనపై రామ్ చరణ్ ఫ్యాన్స్ విమర్శలు చేశారు. అయినప్పటికి కూడా మరోసారి ఉమైన్ సంధు అదే విషయం చెప్పడం ఇరువురి ఫ్యాన్స్‌లో చర్చనీయాంశం అయింది. దీనిపై మీ వ్యాఖ్యలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I am Fan of #JrNTR & #RamCharan now after watching #RRR ! What a Power Packed Performance by them in #RRRMovie ❤️🔥🔥 ! Feeling happy after watching Biggest Cinematic Saga of 2022. #rrrtickets #RRRTakeOver 🌼 pic.twitter.com/wHKxPJbSWA
— Umair Sandhu (@UmairSandu) March 24, 2022
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ ఎంట్రీ.. ఆనందంతో అల్లరి చేసిన ఉపాసన..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.