భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన RRR మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాతో అటు దర్శకధీరుడు రాజమౌళి ఇటు రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారనే ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇక విడుదల రోజే RRR ని చూసిన మెగాస్టార్, డైరెక్టర్ శంకర్ చిత్రం చాలా బాగుందంటూ కితాబిచ్చారు. అయితే ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు తీసుకోస్తారా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పట్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కాదని దర్శక నిర్మాతలు చెబుతున్నారట. మూడు నెలలు తర్వాత అంటే.. జూన్ లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థలైన జీ5, నెట్ ఫ్లెక్స్ లు సొంతం చేసుకోడం విశేషం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.