ఎప్పుడైనా సరే థియేటర్ కి వెళ్లాక పూర్తి సినిమా చూస్తేనే ఆ మజా తెలుస్తుంది. అందులోను ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా పడితే.. థియేటర్లో సగం వరకే చూసి ఆపేస్తే ఎలా ఉంటుందో చెప్పుకోడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ యాజమాన్యం ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓ థియేటర్ లో ప్రముఖ సినీ క్రిటిక్ కి చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సదరు క్రిటిక్.
ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ అనుపమ చోప్రా.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సినీమార్క్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లింది. తీరా ఫస్ట్ హాఫ్ అయిపోయాక.. సెకండాఫ్ లేదని థియేటర్ యాజమాన్యం చెప్పేసరికి ఒక్కసారిగా ప్రేక్షకులంతా ఖంగు తిన్నారు. తాజాగా ఇదే విషయం పై అనుపమ చోప్రా ట్వీట్లు చేశారు.
ఆమె ట్వీట్ లో.. ‘ఇలా జరగడం ఇదే తొలిసారి. RRR మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు నార్త్ హాలీవుడ్ సినీమార్క్ థియేటర్ కి వెళ్లాను. కానీ ఫస్టాఫ్ మాత్రమే చూశాను. ఎందుకంటే థియేటర్ సిబ్బంది సెకండాఫ్ ఇంజెస్ట్ చేయలేదు. ఈ విషయమై మేనేజర్ ని అడిగితే.. సినిమా ఇంకా ఉందనే క్లారిటీ ఇవ్వలేదు. చాలా ఫ్రస్టేటింగ్ గా ఉంది’ అని చెప్పుకొచ్చారు. అయితే.. సాంకేతిక కారణాల వల్లే ఆ థియేటర్ లో ఫస్టాఫ్ వరకే ప్రదర్శించినట్లు సమాచారం.
First time this has happened! Went to @Cinemark North Hollywood #firstdayfirstshow of #RRR. Saw first half but not second because theatre had not ingested it. Manager said they didn’t receive instructions that there was more. Unbelievably frustrating! #Wanttoweep
— Anupama Chopra (@anupamachopra) March 25, 2022
ఆ తర్వాత మొత్తానికి సెకండాఫ్ కూడా చూశానని మరో ట్వీట్ లో తెలిపింది అనుపమ. RRR మూవీ చూసి చాలా ఎంజాయ్ చేశానని.. రాజమౌళి కన్విక్షన్, కమిట్‌మెంట్ తో ఫాంటసీ – రియాలిటీ వర్కౌట్ బాగా వర్కౌట్ అయినట్లు చెప్పుకొచ్చారు. అలాగే సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ ల పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. మరి RRR సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Finally saw both halves of #RRR & really enjoyed the film. The fantasy-reality hybrid works because of @ssrajamouli’s absolute conviction & commitment to his flamboyant vision. @tarak9999 & @AlwaysRamCharan are terrific. Wish the women were less vapid but what a thrilling ride!
— Anupama Chopra (@anupamachopra) March 26, 2022