టాలీవుడ్‌తో పాటు యావత్ భారత్ సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన సినిమా RRR. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా ఊహించినదానికన్నా ఎక్కువ సక్సెస్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డులన్నింటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. మరోసారి తనకు తిరుగులేదని దర్శకుడు రాజమౌళి నిరూపించుకున్నారు. ప్రస్తుతం సినిమా టీమ్ అంతా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుండగా.. హీరోయిన్ మాత్రం అలిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ బర్త్‌డే.. వైరలవుతున్న వరుణ్‌తేజ్ కామెంట్స్!
RRR లో సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆలియా సీత పాత్రలో జీవించింది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమా ఔట్‌పుట్ విషయంలో ఆలియా సంతోషంగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్ అనుకున్న స్థాయిలో లేదని ఆమె ఫీలవుతుందట. అందుకే గత కొన్ని రోజులుగా ఆమె సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయడం లేదని.. ఆఖరికి ఆమె సోషల్ మీడియా ఖాతాలో కూడా సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్ట్ చేయడం లేదని టాక్. సక్సెస్ పార్టీలో కూడా ఆలియా కనిపంచలేదు.
ఇది కూడా చదవండి: RRR సినిమాపై MLA సీతక్క సంచలన వ్యాఖ్యలు!
వీటన్నింటికి మించి మరో షాకింగ్ అంశం ఏంటంటే.. రాజమౌళి మీద కోపంగా ఉన్న ఆలియా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనను అన్‌ఫాలో చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఢిల్లీలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లో మాత్రమే ఆలియా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆలియా నోరు విప్పాల్సిందే అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు. ఇక ప్రస్తుతం ఆలియా భట్ హాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ స్టోన్‌తో బిజీగా ఉంది. మరి ఈ విబేధాల వార్తలపై క్లారిటీ వస్తుందో రాదో చూడాలి అంటున్నారు నెటిజనులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఓటీటీలోకి RRR మూవీ.. ఎప్పుడో తెలుసా?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.