RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. హిందీలో 100 కోట్ల మార్కును సాధించింది. కలెక్షన్ల పరంగానే కాదు. ఆర్‌ఆర్‌ఆర్‌లో 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసిన చాలా మంది చాలా ఫేమస్ అయిపోతున్నారు. సినిమాలో గిరిజన మహిళ లోకిగా నటించిన అహ్మరీన్ అంజుమ్, ఆమె కూతురు మల్లిగా నటించిన ట్వింకిల్ శర్మ ఇలా చాలామంది తెగ ఫేమస్ అయిపోయారు. నిన్నటి వరకు వాళ్ల గురించే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అందులో పాట పాడిన ఓ పాప వంతు వచ్చింది.
సినిమాలోని ‘కొమ్మ ఉయ్యాల’ పాట ఫేమస్ అవ్వటంతో ఆ పాట పాడింది ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆ పాట పాడిన పకృతి రెడ్డి నెట్టింట వైరల్ పర్సన్‌గా మారింది. పకృతి రెడ్డిది కర్ణాటకలోని బళ్లారి. తను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అద్భుతంగా పాటలు పాడుతుంది. పలు తెలుగు టీవీ షోలలో కూడా పకృతి పాల్గొంది. సింగింగ్ రియాల్టీ షో ‘తారే జమీన్ పర్’లో పాల్గొని తన గాత్రంతో శంకర్ మహదేవన్‌ని సైతం మెప్పించింది. అప్పటివరకు రాని ఫేమ్.. ఆర్‌ఆర్‌ఆర్ పుణ్యమా అని ఒక్క రోజులో వచ్చేసింది. పకృతి పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : RRR మూవీలో నటించిన వీరి బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే?