RRR: సాధారణంగా సినిమాలలో గ్రాఫిక్స్ అనేవి సర్వసాధారణం. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ అన్నింట్లో గ్రాఫిక్స్ అవసరం ఎంతో కొంత ఉండనే ఉంటుంది. ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్స్, పీరియాడిక్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీక్వెన్సులు ఉన్నటువంటి సినిమాలలో మనం గ్రాఫిక్స్ ఎక్కువగా చూస్తుంటాం. కానీ.. మనకు ఎక్కడకూడా గ్రాఫిక్స్ శృతిమించిపోయాయని అనిపించకుండా డిజైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు మేకర్స్.
ఈ మధ్యకాలంలో క్లాస్ సినిమాలకంటే.. ఒరిజినల్, భారీ యాక్షన్ సినిమాలనే ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఒకటి సినిమాలో నేటివిటీ, ట్విస్టులతో కూడిన కథైనా ఉండాలి.. రెండోది కళ్లుచెదిరే రీతిలో యాక్షన్ సన్నివేశాలతో, చూస్తుంటే ఒళ్ళుగగ్గుర్పొడిచే స్థాయి విజువల్స్ తో మ్యాజిక్ చేసేయాలి. అయితే.. వీటిలో మొదటిది చిన్న సినిమాలలో అయినా చూసేయొచ్చు. కానీ.. అద్భుతమైన విజువల్స్ కావాలంటే మాత్రం పాన్ ఇండియా సినిమాలలో ఎక్కువగా చూడగలం.
‘ఆర్ఆర్ఆర్‘ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా అద్భుతమైన విజువల్స్, గూస్ బంప్స్ కలిగించే యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పీరియాడిక్ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ ఏడాది మార్చిలో విడుదలైన ట్రిపుల్ ఆర్.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ట్రైలర్ తోనే అందరికీ గూస్ బంప్స్ తెప్పించిన రాజమౌళి.. రిలీజ్ కు ముందు సినిమాలో కొన్ని అద్భుతమైన బ్లాక్స్ ఉన్నాయని.. అవి ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పి అంచనాలు పెంచేశాడు. అదేవిధంగా సినిమా విడుదలయ్యాక రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ ఎపిసోడ్ ని అసలు ఎవరూ ఊహించని రేంజిలో తెరకెక్కించి, పులులు, సింహాలు, జింకలు ఇలా అడవి మృగాలన్నింటినీ ఫైట్ లో ఏకం చేశాడు రాజమౌళి. ఆ సీన్స్ చూసి.. మధ్యలో రామ్ చరణ్ పులిని కొట్టే షాట్ చూసి ఫ్యాన్స్ కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ రూ. 1175 కోట్లు గ్రాస్, రూ. 620 కోట్లకు పైగా వసూల్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక తాజాగా ట్రిపుల్ ఆర్ ఇంటర్వెల్ ఎపిసోడ్ కి సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్ లో.. విఎఫ్ఎక్స్(VFX)తో చిరుత పులులను ఎలా క్రియేట్ చేశారో చూపించారు. అందులో భాగంగానే రామ్ చరణ్ పులిని గాల్లో ఎగిరి కొట్టే షాట్ హైలైట్ అవుతోంది. సినిమాలో అంటే.. చరణ్ తో పాటు పులి ఒకే టైంలో ఎగిరినట్లు చూసి ఆనందించాం. కానీ.. రియల్ గా తెరవెనుక విఎఫ్ఎక్స్ క్రియేట్ చేసిన కష్టం ఈ వీడియోలో మనం చూడవచ్చు. మరి రామ్ చరణ్ గాల్లో ఎగిరి కొట్టిన పులి.. గ్రాఫిక్స్ సృష్టించిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను, ఆర్ఆర్ఆర్ లో మీ ఫేవరేట్ సీన్ ఏది? కామెంట్స్ లో తెలియజేయండి.