సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లకు బాండింగ్ ఎక్కువ. టాలీవుడ్ లో ఈ కల్చర్ పెద్దగా లేకపోయినప్పటికీ.. బాలీవుడ్ స్టార్స్ టీమిండియా ఆటగాళ్లు ఫుల్ టచ్ లో ఉంటారు. విరాట్ కోహ్లీ, యువరాజ్, హర్భజన్ సింగ్ లాంటి చాలామంది క్రికెటర్లు.. బాలీవు హీరోయిన్స్ నే పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం మీక్కుడా తెలుసు. అయితే తెలుగు నటీనటులతో మాత్రం క్రికెటర్లకు పరిచయాలు తక్కువే. కానీ ఎన్టీఆర్, భారత క్రికెటర్లతో దిగిన ఫొటో చూస్తుంటే తెగ ముచ్చటేస్తుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గతేడాది ముందు వరకు సౌత్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత మాత్రం తారక్ పేరు మార్మోగిపోయింది. వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయాడు. హాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర నుంచి మన సినీ సెలబ్రిటీల వరకు ఇప్పటికీ మెచ్చుకుంటూనే ఉన్నారు. అలా తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్న ఎన్టీఆర్ బాగా ఫేమస్ అయిపోయాడు. అందులో భాగంగానే టీమిండియాలో కూడా తారక్ పేరు బాగా వినిపించినట్లు కనిపిస్తుంది.
ఇక న్యూజిలాండ్ తో జనవరి 18న టీమిండియా తొలి వన్డే ఆడనుంది. హైదరాబాద్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చేసిన క్రికెటర్లు.. ‘ఆర్ఆర్ఆర్’ ఫేమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ని కలిశారు. అయితే అనుకోకుండా కలిశారా? లేదా పార్టీ చేసుకోవడం కోసం కలిశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదైనా సరే ఫొటో మాత్రం చూడటానికి కలర్ ఫుల్ గా ఉంది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా వరకు తారక్ రేంజ్ పెరిగిపోయిందని, అస్సలు తగ్గేదే లే అని అభిమానులు, పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి తారక్-భారత క్రికెటర్లతో కలిసిన ఫొటోపై మీ కామెంట్ ఏంటి? కింద పోస్ట్ చేయండి.