ఆర్ఆర్ఆర్.. ఈ ఒక్క సినిమా కోసం ఇండియన్ సినీ లోకం అంతా ఆత్రుతుగా ఎదురుచూస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ మొత్తం 10 భాషల్లో, జనవరి 7న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండగా, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో కూడా అంతే స్థాయిలో అదరగోడుతోంది. ఇందులో భాగంగానే రాజమౌళి తాజాగా RRR గ్లిమ్ప్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకోచ్చారు.
మొత్తం 45 సెకండ్స్ నిడివి ఉన్న RRR గ్లిమ్ప్స్ అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. పైకి చూడటానికి కేవలం కొన్ని షాట్స్ ని కలిపి ఈ గ్లిమ్ప్స్ రెడీ చేసినట్టు అనిపిస్తున్నా, దీని లోపల చాలా కథ చెప్పేశారు జక్కన్న. ఇప్పుడు మనం RRR గ్లిమ్ప్స్ లోతుగా ఉన్న ఆ అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.
45 సెకండ్స్ నిడివి ఉన్న RRR గ్లిమ్ప్స్ మొదటి షాట్ లోనే రాజమౌళి కథలోని సోల్ పాయింట్ చెప్పేశాడు. అప్పటి బ్రిటీష్ పాలకుల పాలనకి ఇండియన్స్ ఎంతటి వ్యతిరేకంగా ఉద్యమించారో మొదటి షాట్ లో చూపించాడు జక్కన్న. ఆ తరువాత 7 సెకండ్స్ వద్ద ఓ పులి అడవిలో మనిషిని తరుముతున్న షాట్ ప్లే అయ్యింది. ఆ షాట్ లో పులిలా వేగంగా పరిగెడుతోంది ఎవరో కాదు.. మన కొమరం భీమ్. ఆ తరువాత షాట్ లో యన్టీఆర్ తలపై నుండి రక్తం కారే షాట్ ఒకటి చూపించారు. ఈ షాట్ ని కేవలం ఫ్యాన్స్ కోసమే పెట్టారు.
ఇక 13 సెకండ్స్ వద్ద పోలీస్ గెటప్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు జక్కన్న. కానీ.., ఇక్కడ రామ్ చరణ్ క్లోజ్ షాట్ ని జాగ్రత్తగా గమనించారా? ఓ వ్యక్తి కాలిపోతున్న విజువల్.. చరణ్ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దృశ్యాన్ని చూస్తూ చరణ్ బాధపడుతున్నాడు కూడా!
నెక్స్ట్ 16 సెకండ్స్ వద్ద అజయ్ దేవగణ్ బ్రిటీష్ వారిని పిట్టలను కాల్చినట్టు కాల్చి పారేస్తున్న విజువల్ ని ప్లే చేశారు. అంటే.. ఈ గ్లిమ్ప్స్ లో మొదటి 18 సెకండ్స్ ముందు క్యారెక్టర్స్ ని పరిచయం చేశాడు జక్కన్న.
నీరు, నిప్పు లాంటి ఈ ఇద్దరు యోధులను అజయ్ దేవగణ్ కలపి.. బ్రిటిష్ వారిపై పోరాటానికి సిద్ధం చేస్తాడు. ఇదంతా కూడా కేవలం మొదటి 18 సెకండ్స్ లో రాజమౌళి చెప్పిన కథ. 19 వ సెకండ్ నుండి 28వ సెకండ్ వరకు కొమరం భీం, రామరాజు, బ్రిటిష్ వారితో చేసిన పోరాటాలను హైలెట్ చేశాడు రాజమౌళి. ఇక మొత్తం టీజర్ లో హైలెట్ షాట్ అంటే 30వ సెకండ్ వద్ద ఉంది. ఈ షాట్ ని మీరు జాగ్రత్తగా గమనించినట్టు అయితే.. అక్కడ ఉరి కొయ్యలు వేలాడేసి ఉన్నారు. లక్షల మంది జనం అక్కడ గుమిగూడి ఉన్నారు. ఆ విజువల్ అంతా చూస్తుంటే ఈ షాట్ ఆర్.ఆర్.ఆర్ క్లయిమ్యాక్స్ లోనిది అని అర్ధం అవుతుంది.
ఒకవేళ ఇదే నిజమైతే.. సినిమా చివరిలో హీరోలు ఇద్దరూ చనిపోతారు అనమాట. ఈ నిజాన్ని నిదానంగా ప్రేక్షకులకి అలవాటు చేయడానికే రాజమౌళి తెలివిగా ఈ షాట్ ని రివీల్ చేశాడని అనుకోవచ్చు. ఇక్కడితో తాను చెప్పాలి అనుకున్న కథని ముగించిన జక్కన్న. మిగతా 15 క్షణాల సమయాన్ని ఫ్యాన్స్ కోసం ఎస్టాబ్లిష్ మింట్ షాట్స్ తో నింపేశాడు. ఏదేమైనా RRR గ్లిమ్ప్స్ ని జాగ్రత్తగా గమనిస్తే.. స్టోరీ లైన్ ఇట్టే అర్ధం అయిపోతుంది. ఒక్క గ్లిమ్ప్స్ లోనే ఇంత కథ చెప్పిన రాజమౌళి ఓవరాల్ మూవీని ఏ స్థాయిలో తెరకెక్కించి ఉంటాడు? మరి.. RRR గ్లిమ్ప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.