RRR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ‘RRR‘. పాన్ ఇండియా మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎటువంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు స్టార్ హీరోలతో విజువల్ వండర్ గా బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ ఆర్.. బ్రేక్ చేసిన రికార్డులు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈ క్రమంలో సినిమా ఓటిటిలో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకుంటోంది.
సినిమా విడుదలై మూడు నెలలు అవుతున్నా దేశవిదేశాల్లో తెలుగు సినిమా స్థాయిని మార్మోగించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప ఫిలిం మేకర్స్ అంతా రాజమౌళితో పాటు ట్రిపుల్ ఆర్ విజువల్స్ ని కొనియాడుతున్నారు. అయితే.. రాజమౌళి సినిమా అంటే.. ఎక్కువ టైం తీసుకున్నా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇక రాజమౌళి సినిమాలలో విజువల్స్ ఎంత గొప్పగా ఉంటాయో.. తెరవెనుక విఎఫ్ఎక్స్(విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్) వర్క్ కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్, ఫారెస్ట్ లో క్లైమాక్స్ ఇవన్నీ థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విజువల్స్ కి సంబంధించి విఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కొమరం భీముడో పాట మేకింగ్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.
ఇదిలా ఉండగా.. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో ఎన్టీఆర్, చరణ్ ఫారెస్ట్ లో ఫైట్ చేసే సన్నివేశాల మేకింగ్ ని మనం చూడవచ్చు. అయితే.. ఈ సీన్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో దర్శనమివ్వగా.. ఎన్టీఆర్ వాటర్ లో నుండి బయటికి వచ్చి.. బైక్ ని కాలుతో తన్ని గాల్లోకి లేపుతాడు. అయితే.. ఈ సీన్ లో ఎన్టీఆర్ అసలు బైక్ ని టచ్ చేయకపోగా.. బైక్ పై ఎక్కి వెళ్లడం అనేది గమనార్హం. ఈ ఫైట్ సీన్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
మొత్తానికి ఎన్టీఆర్ తో బైక్ స్టంట్స్ సన్నివేశాలు థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించాయి. కానీ.. రియల్ గా షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్ లోనే జరుగుతుంది. కాబట్టి.. విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ అయ్యేసరికి సీన్స్ అన్ని మాసివ్ రేంజిలో విజిల్స్ వేయించాయి. ఈ సినిమాకు సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ చేయగా, కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియో చూస్తూ నెటిజన్స్.. అక్కడ బైక్ లేదు కదండీ! అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇదీ చదవండి: RRR ఇంటర్వెల్ ఫైట్ లో అసలు పులి లేదా? ఎంతకి తెగించారు మావ!