ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రిలీజుకి దగ్గర పడుతున్నాయంటే అభిమానుల హడావిడి మాములుగా ఉండదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ.. వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. 2022 జనవరి 7న ఆర్ఆర్ఆర్ మూవీ అన్ని హంగులతో విడుదలకు రెడీ అవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రధానపాత్రల్లో రూపొందిన ఈ పీరియాడిక్ మల్టీస్టారర్.. పై ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే.. సినిమా విజయం మీద నమ్మకం ఉన్నప్పటికీ, థియేటర్ల వద్ద ఫ్యాన్ వార్స్ గురించి మేకర్స్ కంగారు పడుతున్నారట. ఆర్ఆర్ఆర్ సంబంధించి ప్రమోషన్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో అటు మెగా.. ఇటు నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలు రావొద్దనే ఉద్దేశంతో ఇరువురి ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ ఒక ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలుస్తుంది.
ఎంత గొడవలు రావొద్దని అనుకున్నా.. ఒక్కసారి సినిమా థియేటర్లోకి వస్తే మాత్రం వాతావరణం ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఫ్యాన్స్ వార్స్ అనేవి సాధారణంగా ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. కాబట్టి ఫ్యాన్ వార్స్ ఉంటాయని కొందరు.. కాకపోవచ్చని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాన్ వార్స్ కంట్రోల్ చేసేందుకు ఇరు వర్గాల అభిమాన సంఘాలు కూడా అగ్రిమెంట్స్ పై సంతకాలు చేసినట్లు సమాచారం. ఒక విధంగా ఇది మంచిదే.. కానీ ఫ్యాన్స్ కంట్రోల్ అవుతారా లేదా? అనేది మూవీ రిలీజ్ అయ్యేవరకు చెప్పలేము. మరోవైపు హీరోలు రాంచరణ్ – ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉంటూ ఫ్యాన్స్ మధ్య ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి హీరోల ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.