RRR: ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రీసెంట్ ఇండియన్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ ముందే ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక పాన్ ఇండియా పీరియాడిక్ మూవీగా విడుదలైన ట్రిపుల్ ఆర్.. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్ల వరకూ గ్రాస్, రూ. 625 కోట్లకు పైగా షేర్ రాబట్టి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
దర్శకుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ లో చాలా ఎలివేషన్ సన్నివేశాలు రాసుకొని.. థియేటర్లో ఒక్కో సీన్ తో ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పించాడు. ముఖ్యంగా ఇందులో రాంచరణ్, ఎన్టీఆర్ ల ఎంట్రీ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ విధ్వంసం అన్నీకూడా పాన్ ఇండియా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అదీగాక సినిమాలో ఇద్దరు హీరోల పరిచయం ఎలా ఉండబోతోందనే ఆసక్తిని రేకెత్తించాడు రాజమౌళి.
ఎవరు ఊహించని విధంగా బ్రిడ్జి సీన్, దాని కింద గూడ్స్ రైల్, బ్రిడ్జ్ కింద నీటిలో ఓ బాలుడు.. ఇలా అన్ని చిక్కులను ముడివేసి.. ఆ ముడివద్ద ఎన్టీఆర్, చరణ్ లను కలపడం ప్రత్యేకంగా నిలిచింది. అదే సమయంలో ఇద్దరు హీరోలు కలిసి.. నీటిలో, మంటల్లో చిక్కుకున్న బాలుడిని కాపాడే క్రమంలో.. ఒకరినొకరు ఎంతో సహకరించుకుంటూ చేసిన సాహసాలతో ఆర్ఆర్ఆర్ టైటిల్ పడుతుంది.
సినిమా లవర్స్ కి, ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఈ బ్రిడ్జి సీన్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడినుండి ఇద్దరి స్నేహం మొదలవుతుంది. ఇక తర్వాత మిగిలిన సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. రాజమౌళి సినిమా అంటే.. సినిమా కోసం ఏళ్ళు వెచ్చించాల్సి వస్తుందని అనుకుంటారు. కానీ.. లేట్ గా వచ్చినా బ్లాక్ బస్టర్ కొడతాడని మాత్రం ఇన్నేళ్లుగా ప్రూవ్ చేస్తూనే వచ్చాడు.
ఇప్పుడు రాజమౌళి ఏ సినిమా తీసినా బ్రాండ్ అయిపోతుంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటిటిలో సైతం రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. అయితే.. రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి బ్రిడ్జిపై చేసే సాహసాలకు సంబంధించి కొత్తగా మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ వీడియోలో రామ్ చరణ్ జెండా పట్టుకొని బ్రిడ్జి పైనుండి నీటిలోకి దూకే సీన్ చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బైక్ పై నడుముకు తాడు కట్టుకొని దూకే షాట్ లో గుర్రం లేకపోవడం గమనార్హం. మనకు సినిమాలో గుర్రంపై చరణ్ చేసిన విన్యాసాలు ఓహో అనిపిస్తాయి. కానీ.. మేకింగ్ వీడియోలో చూస్తే గుర్రం ప్లేస్ లో వేరే వెహికల్ అరేంజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లోని ఈ సీన్ మేకింగ్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.