అన్ని రంగాల్లోని వారు విడాకులు తీసుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరైన విడాకులు తీసుకుంటే మాత్రం.. అది తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో కూడా విడాకులు అనేది చాలా కామన్ విషయం అనేది అందరికి తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బిగ్ బిగ్ స్టార్స్ అందరూ ఎవరూ ఊహించన విధంగా విడాకులు తీసుకుంటూ ఫ్యాన్స్ షాక్ ఇస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకోవడం వివిధ కారణలతో విడాకులు తీసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా యంగ్ కపుల్స్ మాదిరి పెళ్లై చాలా ఏళ్లు గడిచిన నటీ నటులు విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవలే కొందరు టాలీవుడ్ , కోలీవుడ్ సెలబ్రిటీలు విడాకులు తీసుకుని అందరి షాక్ కి గురి చేశారు. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో కోలీవుడ్ స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
‘బిచ్చాగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దొచుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తెలుగులో ఎంతో పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బిచ్చగాడు మూవీ భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాతో విజయ్ కి తెలుగులో ఫుల్ క్రేజ్ వచ్చింది. బిచ్చగాడు మూవీ తరువాత విజయ్ ఆంటోని తను తమిళంలో తీసే తన సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం హత్య. ఇది విడుదలకు సిద్దంగా ఉంది. ఇక విజయ్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. తన సినిమా గురించి తప్ప ఏ ఇతర విషయాలపై కూడా విజయ్ ట్విట్ చేయడు. అలాంటిది తాజాగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. రీసెంట్ గా ఆయన పెట్టిన పోస్ట్ చూస్తుంటే విజయ్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.
ఆ పోస్టులో.. “కుటుంబంలో ఏమైన సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు. మనం బాధపడుతుంటే చూసి ఆనందించే వాళ్ళు చాలామందే ఉంటారు. మీ కుటుంబంలో సమస్య వస్తే మీరే పరిష్కరించుకోండి. ఒకవేళ భార్యాభర్తలు.. మీరు పరిష్కరించుకో లేకపోతే ఇంటిని వదిలి దూరంగా వెళ్లి బ్రతకండి. అంతే తప్ప మూడో వ్యక్తిని మధ్యలోకి పిలవకండి. మనం బాధపడుతుంటే మన ఓటమిని చూసి ఆనందిస్తారు. అలాంటి మనుషులు ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు” తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం విజయ్ ఆంటోనీ పోస్ట్ వైరల్ గా మారింది. దీన్ని బట్టి విజయ్ కి తన భార్య ఫాతిమాకు మధ్య గొడవలు ఉన్నాయని. ఈ జంటను ఎవరు మూడో వ్యక్తి విడగొట్టాలని చూస్తున్నారని, విజయ్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని కోలీవుడ్ టాక్ వినిపిస్తోంది. విజయ్ ఈ ట్వీట్ దేని గురించి పెట్టాడో చూడాలి.
உங்க குடும்பத்துல எதாவது பிரச்சனன்னா, முடிச்ச வரைக்கும் உங்களுக்குள்ள அடிச்சிக்கங்க, இல்ல விட்டு விலகிடுங்க, இல்ல கைல கால்ல விழுந்து சமாதானம் பண்ணி சேர்ந்து வாழுங்க🤝
அடுத்தவன மட்டும் கூப்புடாதிங்க🎤🫵📺
கும்மி அடிச்சி, கதைய முடிச்சிருவாங்க🔴— vijayantony (@vijayantony) October 11, 2022