ROJA : ఈ మధ్య ఈటీవీ షోలలో రోజాగారి అప్పియరెన్స్ సర్వ సాధారణం అయిపోయింది. అంతేకాదు! ఎప్పుడు ఏదో ఒక షోలో కాంట్రవర్సీతో ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు. మొన్నటి వరకు ‘అంగరంగ వైభవంగా’ షోలో ఆది, భాస్కర్‌లను కొట్టడం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై తమకు తోచిన విధంగా వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జబర్థస్త్ తాజా ప్రోమో విడుదలైంది. ఈ వీక్ షోలో ముగ్గురు జడ్జిలు కనువిందు చేశారు. రోజా, ఆమనితో పాటు ఈ సారి లైలా కూడా జడ్జిగా వ్యవహరించారు. ఈ ప్రోమోలో కూడా రోజా మేడమ్ తన విశ్వరూపం చూపించారు. కమెడియన్ కార్తిక్‌పై సీరియస్ అయ్యారు.
స్కిట్‌లో భాగంగా.. ‘‘నువ్వు నాకొద్దు శాంతి.. మేకప్ తీస్తే రోజాగారిలా ఉంటావ్’’ అని కార్తిక్ అంటాడు.
దీనిపై రోజా సీరియస్ అవుతుంది. ‘‘ఏయ్! ఏదో నవ్వుతున్నాం కదా అని.. ఏదంటే అది వేసేస్తావా జోక్సు..ముగ్గురు జడ్జిలను పిలిచినపుడు కంటెంట్ ఎంత బాగుండాలి. ఏదో పిచ్చి డైలాగులు చెప్పేస్తే చూసేస్తాం అనుకుంటున్నారా?’’.. అంటూ పైకి లేచి వెళ్లిపోబోతుంది. అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఆమని రోజాని ఆపి.. ‘‘ అయ్యో !! మేడమ్, మేడమ్.. ఏంటి అలా వెళ్లిపోతున్నారు’’ అని అడుగుతుంది.అప్పుడు రోజా ‘‘మనకు బ్రేక్ కావాలనుకున్నపుడు.. ఇలా ప్రోమో షాట్ ఇచ్చి పారిపోవాలి’’ అంటూ అక్కడినుంచి పక్కకు వస్తుంది. దీంతో అందరూ పగలబడి నవ్వుకుంటారు. అయితే, ఈ ప్రోమోను బట్టి చూస్తే.. ‘ అంగరంగ వైభవంగా’ షోలో ఆది, భాస్కర్‌లను రోజా కొట్టడం కూడా కేవలం ప్రోమో కోసమే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : షోలో ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ బాబు లవర్! అమ్మాయి ఎవరంటే?