movie news : కాంట్రవర్సీ క్రియేట్ చేసి, ప్రోమోలతో షోకు హైప్ పెంచేయటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. షోలలో ఈ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం.. ‘జబర్ధస్త్’ షోనే అని నొక్కిఒక్కానించి చెప్పొచ్చు. జబర్థస్త్‌ను ఫాలో అవుతూ చాలా షోలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వస్తున్నాయి. గొడవలు పెట్టించటం.. కొట్టించటం.. ఆ షాట్లతో ప్రోమో కట్‌చేసి షోపై ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ పెంచేయటం.. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. తాజాగా జబర్ధస్త్ జడ్జీ రోజా.. కమెడియన్స్ హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్‌ల చంప ఛెళ్లు మనిపించింది. బయట కాదు.. ఈటీవీ ‘అంగరంగ వైభవంగా’షోలో.. ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
ఆ ప్రోమో చివర్లో… బుల్లెట్ భాస్కర్ ‘‘ మీరు మాకే ఇవ్వకపోతే …….ఏం చేస్తారు’’ అని సీరియస్‌గా అంటాడు.
దానికి రోజా మరింత సీరియస్‌గా ‘‘ …… గురించి మాట్లాడకు’’ అంటుంది.
అప్పుడు బుల్లెట్ భాస్కర్ ‘‘ బరాబర్ అంటా మేడమ్’’ అంటాడు. రోజా ఫైర్ అయి బుల్లెట్ బాస్కర్ చెంపమీద కొడుతుంది. అతడు చెంప మీద చెయ్యి పెట్టుకుని బాధతో నిలబడిపోతాడు. అందరూ షాక్ షాట్ కట్ చేస్తే..
హైపర్ ఆది రంగంలోకి దిగుతాడు. ‘‘ఒక ఆర్టిస్ట్ మీద చెయ్యి చేసుకోవటం కరెక్ట్ కాదు’’ అంటాడు. రోజా రెండో ఆలోచన లేకుండా హైపర్ ఆది చెంప మీద కొడుతుంది. అందరూ మరో సారి షాక్ అవుతారు. ప్రోమో ఎండ్ అవుతుంది.మరి షోలో రోజా నిజంగానే వాళ్ల మీద చెయ్యి చేసుకున్నారా? షోలో భాగంగా నటించారా అన్నది ఏప్రిల్ రెండవ తేదీ షో చూస్తే కానీ, తెలీదు. కానీ, రోజా ఆ ఇద్దరి చెంప పగుల కొట్టడానికి కారణాలను ఆడియన్స్ ముందుగానే ఊహించేస్తున్నారు. షో ఏప్రిల్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ ఫూల్స్ చేయటానికే అదంతా చేస్తున్నారని అంటున్నారు. మరి అది ఏప్రిల్ ఫూల్ చేసే ప్రయత్నమా లేదా వేరే కారణం ఏదైనా ఉందా అన్నది వేచి చూడాల్సిందే.. మరి ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రెండో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో..