త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న మంత్రులందరూ పదవుల నుంచి తప్పుకోవాల్సిందేనని.. కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నానని స్వయంగా సీఎం జగన్ తెలిపారు. ఈ క్రమంలో చాలామంది ఆశావాహులు.. మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకి మంత్రివర్గ విస్తరణలో మినిస్ట్రీ ఇవ్వనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం అవుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికి.. తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే రోజాకు మంత్రి పదవి ఖాయమైనట్లే అనిపిస్తుంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: వీడియో: నటి రోజా పై జీవిత సెటైరికల్ కామెంట్స్!
ఎమ్మెల్యేగా చేస్తూనే రోజా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలు చూస్తే ఆమె జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈనెల 25వ తేది అంటే శుక్రవారం టెలికాస్ట్ కాబోయే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో రోజా, ఆమనితో పాటు మరో కొత్త జడ్జీ కనిపించారు. ఆమె లైలా. ఎగిరే పావురమా సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ లైలా ఇకపై జబర్ధస్త్ జడ్జీగా వ్యవహరిస్తుందనే సంకేతం ఇచ్చింది మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్.
ఇది కూడా చదవండి: హైపర్ ఆది, బులెట్ భాస్కర్‌ల చెంప ఛెళ్లుమనిపించిన రోజా
ఈ ప్రోమోలో రోజాతో పాటు నటి ఆమని, లైలా ఉన్నారు. ఇక రోజా మిగతా ఇద్దరికి కంటెస్టెంట్స్ చేసే స్కిట్‌లను ఎలా రిసీవ్ చేసుకోవాలి..ఎలా కామెంట్ చేయాలి..ఎలా కాంప్లిమెంట్ ఇవ్వాలనే విషయాలపై ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా గమ్మత్తేంటంటే ఈ ప్రోమోలో ఆమని నువ్వు జడ్జీగానే ఉన్నావుగా మళ్లీ ఎందుకు అని రోజాని ప్రశ్నిస్తే.. అందుకు ఆమె.. నేను బాగా చేస్తే లైలాను ఎందుకు పిలుస్తారని చెప్పింది.
ఇది కూడా చదవండి: నా మీదే జోక్స్ వేస్తావా? జబర్ధస్త్ కార్తిక్‌పై రెచ్చిపోయిన రోజా!
దీన్ని బట్టి చూస్తే రోజా జబర్దస్త్ నుంచి ఔట్ అని..ఆమె పొజిషన్‌లో హీరోయిన్ లైలా నెక్స్ట్ జడ్జీ అని తేలుస్తోంది. అంతేకాక ఇక రోజాకి మినిస్ట్రీ కన్ఫామ్ అనే వార్తలు కూడా నిజమే అనిపిస్తున్నాయి. మరి దీని గురించి పూర్తిగా తెలియాలంటే.. మార్చి 25 ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఎదురు చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.