తమిళ స్టార్ నటుడు శింబు నటించిన పత్తుతల సినిమాను చూసేందుకు చెన్నైలోని కోయంబేడు రోహిణీ థియేటర్‌కు అభిమానులు వచ్చారు. వారిలో గిరిజన, సంచార జాతికి చెందిన వారున్నారు. టికెట్లు తీసుకుని తమ అభిమాన నటుడ్ని తెరపై చూసేందుకు సిద్ధంగా ఉండగా.. ఆ థియేటర్‌లో పనిచేసే ఓ వ్యక్తి వీరిని నిలిపివేశాడు. ఈ ఘటనపై కమల్ తో సహా పలువురు తీవ్రంగా స్పందించారు.
సినిమా అంటే యమ క్రేజ్. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే.. హీరోతో సంబంధం లేకుండా థియేటర్లకు పరుగులు పెడతారు సినిమా పిచ్చోళ్లు. అదీ ఫేవరేట్ హీరో, హీరోయిన్లు సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ ఆనందమే వేరు. ఇక ఎప్పుడు సినిమా చూడాలన్న ఆత్రుత ఉంటుంది. అలా ఓ హీరో సినిమాకు చూసేందుకు వెళ్లిన కొంత మంది అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. టికెట్లు తీసుకుని ఇక సినిమా చూడటమే తరువాయి అనుకున్న సమయంలో థియేటర్ లోపలికి వారిని అనుమతించేందుకు నిరాకరించారు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళ స్టార్ నటుడు శింబు నటించిన పత్తుతల సినిమా శ్రీరామ నవమి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు చెన్నైలోని కోయంబేడు రోహిణీ థియేటర్‌కు అభిమానులు వచ్చారు. వారిలో గిరిజన, సంచార జాతికి చెందిన వారున్నారు. టికెట్లు తీసుకుని తమ అభిమాన నటుడ్ని తెరపై చూసేందుకు సిద్ధంగా ఉండగా.. ఆ థియేటర్‌లో పనిచేసే ఓ వ్యక్తి వీరిని నిలిపివేశాడు. టికెట్ చూపినా కూడా వారిని లోపలికి పంపలేదు. అయితే తమ వేషధారణ చూసి లోనికి అనుమతించలేదని సదరు వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అడ్డుకుంటున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారడంతో పాటు థియేటర్ యాజమాన్యంపై విమర్శలు మొదలయ్యాయి. ఈ వివాదంపై గిరిజనుల హక్కుల సాధన ఉద్యమకారులు సీరియస్‌గా స్పందించారు.
ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం దీనిపై వివరణనిచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు / ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ సర్టిఫికెట్ ప్రకారం 12 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించేందుకు వీలు లేదని చెప్పింది. సదరు గిరిజన కుటుంబం 12 ఏళ్లలోపు నలుగురు పిల్లలతో థియేటర్‌కు వచ్చారని, ఆ పిల్లలను లోనికి అనుమతించమని చెప్పామని, కొద్ది సేపటికి పంపామని రోహిణి థియేటర్ యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ ఘటనపై ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కమలహాసన్, విజయ్‌సేతుపతి, సూరి, దర్శకుడు వెట్రిమారన్, నటి ప్రియా భవానిశంకర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా కమలహాసన్ ట్విటర్లో పేర్కొంటూ టికెట్ తీసుకున్న తర్వాత కూడా సంచార జాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించకపోవడం శోఛనీయం. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత వారిని అనుమతించడం ఖండించదగ్గ విషయం అని పేర్కొన్నారు.
దర్శకుడు వెట్రిమారన్ శ్రమజీవులను థియేటర్లోకి రానీయకుండా అడ్డుకోవడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. కమెడియన్ సూరి స్పందిస్తూ జరిగిన సంఘటనకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియా భవాని శంకర్ స్పందిస్తూ సంచార జాతి ప్రజలకు మద్దతు తెలిపారు. అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నప్పుడు టికెట్ ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు థియేటర్లోకి అనుమతించడం లేదు అని సంచార జాతి మహిళా ప్రశ్నే ఇలాంటి వ్యతిరేక చర్యలకు తొలి గొంతు అని భవాని శంకర్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక కోయంబేడు పోలీసులు రోహిణి థియేటర్ నిర్వాకంపై అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
டிக்கெட் இருந்தும் நாடோடிப் பழங்குடியினருக்குத் திரையரங்கத்திற்குள் அனுமதி மறுக்கப்பட்டுள்ளது. சமூகவலைதளங்களில் எதிர்ப்பு கிளம்பிய பிறகே அவர்கள் அனுமதிக்கப்பட்டுள்ளனர். இது கண்டிக்கத்தக்கது. https://t.co/k9gZaDH0IM
— Kamal Haasan (@ikamalhaasan) March 31, 2023
டிக்கெட் இருந்தும் நரிக்குறவ மக்களை படம் பார்க்க அனுமதிக்காத @RohiniSilverScr திரையரங்கம் …
இவுங்களுக்கு நீ தனி ஷோ போட்டுக்காட்டத்தான் போற அத நான் பாக்கத்தான் போறேன் …#RohiniTheatre #PathuThala @SilambarasanTR_ @CMOTamilnadu @IamSellvah pic.twitter.com/1Pd3rE8CsV
— Viji Nambai (@vijinambai) March 30, 2023
எல்லாரும் அவங்க வேலைய பார்த்துட்டுப் போறப்போ, ticket இருக்ககுல்ல, ஏன் உள்ள விட மாட்டேங்கிறீங்கன்னனு கேட்ட அந்த குரல் தான் இது போன்ற செயலுக்கு எதிரான முதல் குரல். அவங்க உடை தான் திரையரங்க நிர்வாகிகளுக்கு பிரச்சனைனா, அவரகள் அறிய, அடைய வேண்டிய நாகரிகம் ரொம்ப தூரத்துல இருக்கு. https://t.co/psu5LyhIrl
— Priya BhavaniShankar (@priya_Bshankar) March 30, 2023