ఓ ప్రముఖ స్టార్ హీరో నమిలిన చూయింగ్ గమ్ ఒకటి వేలానికి వచ్చింది. ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలో వేలానికి ఉన్న దాని ప్రారంభ ధర కళ్లు చెదిరేదిగా ఉంది. దాన్ని కొనడానికి కొంత మంది అభిమానులు..
సినిమా వాళ్లకు సంబంధించిన విషయాలకు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ క్రేజ్‌ను కొన్ని సంస్థలు, మనుషులు క్యాష్ చేసుకోవటానికి చూస్తూ ఉంటారు. సినీ సెలెబ్రిటీలకు చెందిన వస్తువులను వేలం వేస్తూ ఉంటారు. సెలెబ్రిటీలు వాడిన వస్తువులను, తాగి పడేసిన కాఫీ కప్పులను ఇలా అన్ని రకాల వాటిని వేలం వేస్తూ ఉంటాయి. తాజాగా, ఓ ప్రముఖ హీరో నమిలి పడేసిన చూయింగ్ గమ్ వేలానికి వచ్చింది. ప్రారంభ ధరే కళ్లు చెదిరేలా ఉంది.
అసలు విషయానికి వస్తే.. ప్రముఖ హాలీవుడ్ హీరో, ఐరన్ మ్యాన్ ఫేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్ తాజాగా నమిలిన పడేసిన చూయింగ్ గమ్ వేలానికి వచ్చింది. ఓ ఆన్‌లైన్ వ్యాపార సంస్థలో ఓ వ్యక్తి.. రాబర్డ్ డౌనీ జూనియర్ నమిలిన చూయింగ్ గమ్ అంటూ ఓ దాన్ని వేలానికి పెట్టాడు. కొద్దిరోజుల క్రితం రాబర్డ్ హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ వేడుకలో పాల్గొన్నారు. ఐరన్ మ్యాన్ డైరెక్టర్ జాన్ ఫారూను ఈ వేడుకలో స్టార్ హోదాతో ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలోనే రాబర్ట్ అక్కడి నేలపై ఉన్న ఓ స్టార్‌పై తాను నమిలిన చూయింగ్ గమ్‌ను సరదాగా ఉంచారు. అలా స్టార్ పై ఉంచిన చూయింగ్ గమ్‌ను తాను సంపాదించినట్లు.. దాన్ని వేలానికి వేస్తున్నట్లు ఓ వ్యక్తి తెలిపాడు.
దీని ప్రారంభ ధర 40 వేల డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 32 లక్షల రూపాయలు అన్నమాట. ఇక ఈ చూయింగ్ గమ్ వేలంలో అంతకంటే ఎక్కువ ధర పలక వచ్చు. ఈ వేలం పాట ఏప్రిల్ 1వ తేదీన ముగియనుంది. రాబర్ట్ నమిలిన చూయింగ్ గమ్‌ను సొంతం చేసుకోవటానికి ఏ అభిమాని ఎంత భారీ మొత్తం పెడతాడో వేచి చూడాల్సిందే. అయితే, ఇక్కడో అర్థం కాని విషయం ఏంటంటే.. అసలు ఆ చూయింగ్ గమ్ రాబర్ట్‌దేనా అని. అది అతడిదే అనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. దాన్ని రాబర్ట్ డీఎన్‌ఏతో టెస్ట్ చేస్తే తప్ప. మరి, రాబర్ట్ డౌనీ జూనియర్ నమిలినదిగా ఆరోపిస్తున్న చూయింగ్ గమ్ కళ్లు చెదిరే ధరకు వేలానికి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.