అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోతో బాలకృష్ణ చేస్తున్న మ్యాజిక్ ఎంతోమందిని అలరిస్తుంది, ఆనంద పరుస్తుంది. ప్రభాస్, రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళతో షో చేస్తూ.. ఫ్యాన్స్ మధ్య ఉన్న బేధాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ. పార్టీలకు అతీతంగా మనసు విప్పి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. అయినా కూడా పార్టీలతో సంబంధం లేకుండా షో నిర్వహిస్తున్నారు. వైసీపీ పార్టీకి చెందిన మంత్రి రోజాను కూడా పార్టీతో సంబంధం లేకుండా ఆహ్వానించాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని రోజాను గతంలో అడిగారు. ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్లు వెల్లడించారు. బాలకృష్ణతో కలిసి 7 సినిమాలు చేసానని, ఇద్దరిదీ హిట్ కాంబినేషన్ అని అన్నారు.
రెండు సార్లు అన్ స్టాపబుల్ షోకి తనకు ఆహ్వానం అందిందని.. అయితే అసెంబ్లీ సమావేశాల కారణంగా వెళ్లలేకపోయానని అన్నారు. అయితే అప్పటి వరకూ అన్ స్టాపబుల్ షోకి వెళ్లాలని ఉండేదని, అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆ షోకి వెళ్లారో అప్పుడే వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు. జీవితంలో అన్ స్టాపబుల్ షోకి వెళ్లకూడదని అనిపించిందని అన్నారు. ఇప్పటివరకూ షో బాగా చేశారు కానీ.. ఆ షోలో మాత్రం చనిపోయిన ఎన్టీఆర్ ని ఫూల్ చేసే విధంగా.. వెన్నుపోటు పొడవడం కరెక్ట్ గా అన్న విధంగా చూపించారని అన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు, బాలకృష్ణ ఆ వేదికను రాజకీయం కోసం ఉపయోగించుకోవడం చూశాక.. ఆ షోకి పోవాలన్న ఆశ పోయిందని .. పిలిచినా కూడా వెళ్లనని అన్నారు. మరి రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.