తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చకున్న అల్లు అర్జున్ కి ఇక్కడే కాదు.. . తమిళ్, మళయాళ ఇండస్ట్రీలో కూడా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. తెలుగు లో రిలీజ్ అయిన ప్రతి చిత్రం మాలీవుడ్ లో రిలీజ్ అవుతుంది. కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు. కేరళలో అల్లు అర్జున్ కు విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరే టాలీవుడ్ హీరోకూ అక్కడ అంత క్రేజ్ లేదనే చెప్పాలి. తాజాగా ఈ హీరో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ్, మళయాలంలోనే కాకుండా.. హిందీలోనూ విడుదల చేయనున్నారు. తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఘన స్వాగతం పలికారు. అంతే కాదు ఆయనకు ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతనమైన బహుమానాన్ని ఇవ్వడం విశేషం.
కేరళ మూలాలు ఉండి దుబాయ్ లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ యూఏఈలో అల్లు అర్జున్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన అల్లు అర్జున్ కి 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ కానుక చూసి అల్లు అర్జున్ పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.