రితికా సింగ్.. తన అందం, అభినయంతో కుర్రకారును ఓ ఊపు ఊపేస్తోంది. తన రింగు రింగుల జుట్టుతో ఏదో మాయ చేస్తూ యువతను కట్టిపడేస్తుంటుంది. అయితే రితికా సింగ్ అనతి కాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని తెలుగు, తమిళం, హింది వంటి భాషల్లో నటిస్తూ దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే రితికా సింగ్ నటిగానే కాకుండా 2009లో ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లిగ్ లలో పాల్గొని క్రీడాకారిణిగా తన సత్తా ఏంటో రుచి చూపించింది. ఇక ఆ తర్వాత రితికా సింగ్ 2012 ఇరుదుచుట్ర అనే తమిళ్ సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేసింది.
ఇక మరి కొంత కాలం తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన గురు చిత్రంలో రితికా సింగ్ నటించి నటనలోనూ ఏం తక్కువ కాదన్నట్లుగా నిరుపించింది. ఈ సినిమాలో రితికా తన ఫర్ ఫెక్ట్ ఫిజిక్ తో మార్షల్ ఆర్ట్స్ లో అదరగొట్టి ప్రేక్షకుల మనసును దోచేసుకుంది. గ్లామర్ పాత్రలే కాకుండా రితికా సింగ్ మొదట సినిమాతోనే డీ గ్లామర్ పాత్రలోనూ నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడు అప్పటి నుంచి చిన్నా, చితక సినిమాలు చేస్తూ ఎక్కాడ గ్యాప్ లేకుండా దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. తన రింగుల జుట్టుతో తనదైన సోగసులను ఒలకబోస్తూ అభిమానులకు మత్తెక్కిస్తుంటుంది. ఇకపోతే తాజాగా రితికా సింగ్ తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లకు చెమటలు పట్టేస్తున్నాయి. ఇందులో తన పరువపు అందాలతో రితికా సింగ్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఫోస్ట్ చేసిన ఈ ఫొటోలు తక్కువ సమయంలోనే వైరల్ గా మారాయి.