పండగలు గానీ, ఏవైనా అకేషన్స్ గానీ వచ్చినప్పుడు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ అన్నీ వినూత్నమైన షోలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ పండగ వాతావరణాన్ని బుల్లితెరపై తీసుకొస్తుంటాయి. ఆ ఛానల్‌లో పనిచేసే బుల్లితెర నటులు, కమెడియన్స్‌తో ఒక స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తారు నిర్వాహకులు. ఈ ఈవెంట్‌లో ఆర్టిస్టుల కుటుంబ సభ్యులను ఆహ్వానించడం మరొక ఎత్తు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ రాఖీ పండుగ సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించారు. హలో బ్రదర్ పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మహిళా ఆర్టిస్టులతో తమ తమ అన్నయ్యలకి రాఖీ కట్టించారు. చెల్లెమ్మలు హారతి ఇచ్చి రాఖీ కడుతుంటే అన్నయ్యలు చాలా సంతోషించారు. అయితే రీతూ చౌదరి మాత్రం ఆ సంతోషాన్ని పొందలేకపోయారు.
అన్నయ్య ఉన్నప్పటికీ ఆమె తన సంతోషాలని పంచుకోవడానికి అవకాశం లేదు. సీరియల్స్ ద్వారా బుల్లితెరపై పరిచయమై జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న రీతూ చౌదరి.. రక్షాబంధన్ స్పెషల్ ఈవెంట్ అయిన ‘హలో బ్రదర్’లో పార్టిసిపేట్ చేశారు. ఈ షోలో అందరు కంటిస్టెంట్లు తమ అన్నలకి రాఖీ కడుతుంటే రీతూ అన్న మాత్రం రాఖీ కట్టడానికి రాలేదు. ఇదే విషయంపై రీతు మీ బ్రదర్ ఎక్కడ అని యాంకర్ శ్రీముఖి అడిగారు. వీళ్ళలాగ మా అన్నయ్యకి రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేదని, ఇక్కడ ఈ ఫీల్డ్‌లో ఉండడం తన అన్నకి ఇష్టం లేదని చెబుతూ రీతూ ఎమోషనల్ అయ్యారు. రీతు మాటలకి షోలో ఉన్న వారంతా ఎమోషనల్ అయ్యారు.
అయితే శ్రీముఖి రీతూకి ఒక సర్పైజ్ ఇచ్చారు. “అమ్ములు నేనొచ్చానురా” అంటూ రీతు అన్నయ్య ప్రత్యక్షమయ్యారు. దీంతో రీతు వర్మ కంటతడి పెట్టుకున్నారు. అన్నయ్య స్టేజ్‌పైకి రాగానే గట్టిగా పట్టుకుని ఏడ్చేశారు. దీంతో మిగతా కంటిస్టెంట్లు కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ షోతో రీతూ మీద అన్నయ్యకి కోపం పోయినట్టే అని, మొత్తానికి ఈ షో ద్వారా చెల్లెలి మనసేంటో అన్నయ్యకు తెలిసిందని, ఇక రీతూకి అన్నయ్య రాఖీ కట్టలేదన్న లోటు తీరిపోయినట్టే అని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ షో ఆగస్ట్ 7న ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. మరి అన్నయ్యని చూసి ఎమోషనల్ అయిన రీతూ చౌదరిపై, అలానే ఆమెకి సర్ప్రైజ్ ఇచ్చిన షో నిర్వాహకులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.