ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, రష్మిక మందానలకు సంబంధించి ఓ వివాదం హాట్ టాపిక్ గా మారింది. గతంలో రష్మిక చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా రిషబ్ శెట్టి తాజాగా రియాక్ట్ అయ్యాడని సినీ వర్గాలు అంటున్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం.. రిషబ్, రష్మికల మధ్య ‘కిరాక్ పార్టీ’ మూవీ నుండే సైలెంట్ వార్ నడుస్తుందట. మరి అసలు రిషబ్ శెట్టి – రష్మిక మందానల మధ్య గొడవేంటి? అందుకు కారణమేంటి? రిషబ్ శెట్టి ఎలా కౌంటర్ వేశాడు? అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ విషయం ‘కిరాక్ పార్టీ’ సినిమా దగ్గరనుండి మొదలుపెట్టాలి. 2016లో తెరకెక్కిన కిరాక్ పార్టీ సినిమాతో రష్మిక మందాన హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత తెలుగులోకి వచ్చి ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప ఇలా వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఈ విషయాన్నీ పక్కన పెడితే.. కిరాక్ పార్టీ సినిమాలో రష్మిక.. రక్షిత్ శెట్టి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. అదే సినిమా టైంలో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే.. అంతలోనే ఏమైందోగాని ఎంగేజ్మెంట్ అయిన కొద్దిరోజులకే రక్షిత్ శెట్టితో పెళ్లి క్యాన్సల్ చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత మళ్లీ రక్షిత్ శెట్టి గురించి, లవ్ బ్రేకప్ గురించి పెద్దగా స్పందించలేదు. కానీ.. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పై ఇండైరెక్ట్ కౌంటర్ వేసింది.
ఓ ఇంటర్వ్యూలో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? అనే ప్రశ్నకు.. “కాలేజ్ డేస్ లో నేను మోడలింగ్ చేస్తున్నాను. ఆ టైంలోనే ఈ సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ నుండి కిరాక్ పార్టీ మూవీ ఆఫర్ వచ్చింది” అంటూ రెండు చేతులతో సైగలు చేస్తూ చెప్పింది. సరే ఎంత బ్రేకప్ అయిపోయినా.. మొదటి అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ పేరు నోటితో చెప్పొచ్చుగా.. అలా చేయి సైగలు చేసి చూపించడం మర్యాద అనిపించుకోదని నెటిజన్స్ తీవ్రంగా విమర్శించారు. రష్మిక అలా సైగ చేస్తూ చూపించిన వీడియో అప్పట్లో రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిలకు కౌంటర్ గానే అంటూ అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి దీనిపై రక్షిత్ గానీ, రిషబ్ గానీ స్పందించలేదు.
కట్ చేస్తే.. కాంతార బ్లాక్ బస్టర్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి.. రష్మిక స్టైల్ లోనే తిరిగి కౌంటర్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ‘సాయి పల్లవి, సమంత, రష్మిక వీరిలో ఎవరితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు రిషబ్ స్పందిస్తూ.. “నాకు సాయి పల్లవి, సమంతల యాక్టింగ్ చాలా ఇష్టం.. అలాగే కొత్తవాళ్లతో కూడా చేస్తాను. కానీ.. ఇలాంటి వారితో అసలు వర్క్ చేయను..” అంటూ రష్మిక సిగ్నేచర్ సైగలు చూపించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంటే ఇండైరెక్ట్ గా మొహమాటాలు లేకుండా రష్మిక పై తన అభిప్రాయాన్ని చెప్పేశాడు రిషబ్ శెట్టి. మరో విషయం ఏంటంటే.. కిరాక్ పార్టీ మూవీకి డైరెక్టర్ రిషబ్ శెట్టినే. అవకాశం ఇస్తే అలా కౌంటర్ వేస్తుందా అని.. ఇప్పుడు ఇలా రష్మికకు రీకౌంటర్ వేశాడని అంటున్నారు ఫ్యాన్స్. కాగా.. మొదట తప్పు రష్మికదే అని.. ఆమెకు అసలు బుద్దుందా అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్స్. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లనుందో!
The Journey of two “✌️✌️” pic.twitter.com/rbGrdli6K9
— MNV Gowda (@MNVGowda) November 21, 2022