ఇండస్ట్రీలో ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, హీరోయిన్ రష్మిక మందాన మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రిషబ్ శెట్టి పెట్టిన ట్వీట్ ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారడానికి కారణమైంది. గతంలో రష్మిక చేసిన కామెంట్స్ పై కౌంటర్ వేస్తూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి కొన్ని వ్యాఖ్యలు, సైగలు చేశాడు. ఆ తర్వాత రష్మిక కాంతార చూడలేదని, తన ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడినప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఆమెపై భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. కొద్దిరోజులకు తాను కాంతార చూసి టీమ్ కి మెసేజ్ చేశానని, వారు థాంక్యూ అని రిప్లై ఇచ్చారని చెప్పింది రష్మిక. దీంతో ఇద్దరి మధ్య అంతా ఓకే అయ్యిందని అనుకున్నారు.
కట్ చేస్తే.. రిషబ్ శెట్టి కొత్త ట్వీట్ తో వీరి మధ్య ఇంకా గొడవ సద్దుమణగలేదని తెలుస్తోంది. కాంతార మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రిషబ్ శెట్టికి, రష్మికకి మధ్య గొడవ ఎలా మొదలైంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే.. 2016లో రిషబ్ శెట్టి తీసిన ‘కిరాక్ పార్టీ’ సినిమాతో రష్మిక మందాన హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప లాంటి హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా మారింది. కిరాక్ పార్టీ సినిమాలో రక్షిత్ శెట్టి పక్కన నటించి అతనితో ప్రేమలో పడి.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఏమైందోగాని ఎంగేజ్మెంట్ చేసుకున్న కొద్దిరోజులకే పెళ్లి క్యాన్సల్ చేసుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ రక్షిత్ శెట్టి గురించి, లవ్ బ్రేకప్ గురించి స్పందించకపోగా.. ఓ సందర్భంలో కిరాక్ పార్టీ ప్రొడక్షన్ హౌస్ పై కౌంటర్ వేసింది. ‘సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్’ అంటూ ప్రొడ్యూసర్ పేరు చెప్పకుండా రెండు చేతులతో సైగలు చేస్తూ చెప్పింది. రష్మిక అలా సైగ చేసిన వీడియో అప్పట్లో రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిలకు కౌంటరే అంటూ కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే.. కాంతార హిట్ తర్వాత రిషబ్ శెట్టి కూడా రష్మిక స్టైల్ లోనే తిరిగి కౌంటర్ వేసి ఆశ్చర్యపరిచాడు. ‘కొత్తవాళ్లతో సినిమాలు చేస్తాను. కానీ.. ఇలాంటి వారితో అసలు వర్క్ చేయను’ అంటూ రష్మికలాగే సైగలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా కిరాక్ పార్టీ విడుదలై 6 సంవత్సరాలు పూర్తవడంతో సినిమాని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ పెట్టాడు రిషబ్.
‘మా కిరాక్ పార్టీ సినిమా విడుదలై ఆరేళ్లు అవుతుంది. థియేటర్స్ లో మా సినిమా చూస్తూ మీరు చేసిన సందడి, విజిల్స్ ను మరచిపోలేం. అవి ఇంకా మా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అని ట్వీట్ చేస్తూ.. రక్షిత్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ ని, ప్రొడక్షన్ హౌస్ ని ట్యాగ్ చేశాడు. కానీ.. హీరోయిన్ రష్మిక మందనని ట్యాగ్ చేయకపోవడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఇంకా రిషబ్ శెట్టికి రష్మికపై కోపం తగ్గలేదని.. ఈ ట్వీట్ ఖచ్చితంగా రష్మికకి కౌంటర్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మరోవైపు కిరాక్ పార్టీ మూవీని గుర్తు చేసుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి.. రక్షిత్, రిషబ్ లను ట్యాగ్ చేయలేదు. మరిప్పుడు ఇద్దరి పోస్టులు వైరల్ గా మారాయి. కానీ, వివాదం ఎప్పుడు క్లియర్ అవుతుందో చూడాలి! రష్మిక, రిషబ్ శెట్టిల వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
‘ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ’ ನೆಡೆದು ಆರು ವರ್ಷಗಳ ನಂತರವೂ ಪಾರ್ಟಿಗೆ ಕಳೆ ತಂದ ನಿಮ್ಮ ಸದ್ದು, ಗದ್ದಲ, ಸಿಳ್ಳೆಗಳು ಇನ್ನೂ ಕಿವಿಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿಸುತ್ತಿವೆ. ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ನೋಡುವಂತೆ ಮಾಡುತ್ತವೆ. ಈ ಸಂಭ್ರಮದ ಭಾಗವಾದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. @rakshitshetty @ParamvahStudios @AJANEESHB #KirikParty pic.twitter.com/Rgaq5Lywmq
— Rishab Shetty (@shetty_rishab) December 30, 2022
— Hardin (@hardintessa143) December 31, 2022