సినీ ఇండస్ట్రీలో వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అటు సినిమాల పరంగా, ఇటు సోషల్ మీడియా వేదికగా వివాదాలు సృష్టించడంలో.. అందులో పరకాయ ప్రవేశం చేయడంలో వర్మని ఎవరు బీట్ చేయలేరు. మొన్నటివరకూ ఏపీలో సినిమా టికెట్ రేట్స్ గురించి ట్విట్టర్ వేదికగా రచ్చ చేసిన వర్మ.. ఈసారి పవన్ కళ్యాణ్ పై వరుస ట్వీట్స్ వేసి వార్తల్లో నిలిచాడు.
ఎల్లప్పుడూ ఏదొక పోస్ట్ తో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యే వర్మ.. తాజాగా పవన్ కళ్యాణ్ పై, ఆయన నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా పై తనదైన శైలిలో ట్వీట్స్ చేశాడు. “పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదని.. ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు. ఫలితం కూడా చూసారు. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా, భీమ్లా నాయక్ మూవీని ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చెయ్యండి. పవర్ ప్రూవ్ చెయ్యండి” అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
. @pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు…ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి.
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
అంతటితో ఆగకుండా.. “పుష్ప సినిమానే అంత చేస్తే పవర్ స్టార్ అయినటువంటి మీరు నటించిన ‘భీమ్లా నాయక్’ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి..? పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము”
పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
… @allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి @PawanKalyan
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
‘అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైంలో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి.. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రాంచరణ్ లు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగుని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి’.
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
“ఇంటీరియర్ ఆంధ్రలో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు.. కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారు?” అంటూ వర్మ చేసిన ట్వీట్స్ వివాదాలకు దారితీసే విధంగానే ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ కూడా ఓ రకంగా వర్మ చెప్పేది నిజమే కదా అనుకుంటున్నారు.
ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా @pawanKalyan గారూ???
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
ఈసారి వర్మ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన విషయం అర్ధమవుతోంది. కానీ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడే వర్మ ఇంటెన్షన్ ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వర్మ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతూనే అటు ఇండస్ట్రీ వర్గాలలో, ఇటు అభిమానులలో చర్చనీయాంశంగా మారాయి. అప్పుడేమో డైరెక్ట్ సినిమాని వద్దన్నవాడు.. ఇప్పుడు రీమేక్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయమంటున్నాడు.. ఏంటా! అని కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు.
ఇక భీమ్లా నాయక్ సినిమాలో పవన్ తో పాటు రానా, నిత్యామీనన్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ రిలీజ్ కాబోతుంది. మరి వర్మ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.