సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. సమంత కూడా ఇన్‌స్టాగ్రాంలోఈ విషయాన్ని ధృవీకరించారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు. దీనిపై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు రక రకాలుగా స్పందించారు. కొంత మంది ఈ విషయం చాలా బాధ కలిగిస్తుందని.. మరికొంత మంది ఆశ్చర్యం వేస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక ఇండస్ట్రీలో తన ట్విట్స్ తో ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా నాగ చైతన్య- సమంత ల విడాలకులపై తనదైన స్టైల్లో స్పందించారు. ‘వివాహాలు కాదు, విడాకులు జరుపుకోవాలి..వివాహమే మరణం మరియు విడాకులు పునర్జన్మ’ అంటూ సంచలన ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ. తాజాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆర్జీవీ ట్విట్ పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Not Marriages, Divorces should be celebrated..Marriage is death and Divorce is rebirth💐💐💐 https://t.co/87HKdcAQ6L via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2021