డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ మధ్య వార్తల్లో బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే మనోడు తీసిన ‘డేంజరస్’ సినిమా థియేటర్లలోకి వచ్చి వెళ్లిన విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ వర్మని ఇంటర్వ్యూ చేసిన భామలు తెగ ఫేమస్ అయిపోతూ ఉంటారు. కొన్నాళ్ల ముందు అరియానా, అషూరెడ్డి అలానే వర్మతో కలిసి రచ్చ రచ్చ చేశారు. ఇక మొన్నటికి మొన్న కూడా ఆషూరెడ్డి-వర్మ ఇంటర్వ్యూ ఎలా చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా సిరి స్టేజీ అనే మరో భామతో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ లేపుతోంది. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూపై టాలీవుడ్ స్టార్ రైటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే… కొన్నిరోజుల ముందు ‘డేంజరస్’ అని ఓ 20 మంది అమ్మాయిలతో ఆర్జీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. అందులో ఓ అమ్మాయి… వర్మని హగ్ అడిగి మరీ హగ్ చేసుకుంది. ఇక ఆమెనే సెపరేట్ గా పిలిచిన వర్మ ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా ఓపెన్ గా, డెప్త్ ఉన్న క్వశ్చన్స్ తో ఆ అమ్మాయి రెచ్చిపోయింది. ఇందులో ఆమె అడిగిన ప్రశ్నలు, ముచ్చట్లు పెట్టుకున్న తీరుతో నెటిజన్లకు బుర్ర తిరిగిపోయింది. ఎందుకంటే ఆమె బాడీలో ఏయే పార్ట్స్ ఉన్నాయో అక్కడ కెమెరాలు పెట్టి ఇంటర్వ్యూ చేసి విధానం.. అందరికీ మైండ్ పోయేలా చేసింది. ఈ క్రమంలోనే చాలామంది ఆర్జీవీని తిట్టుకుంటూనే ఆ ఇంటర్వ్యూ చూస్తున్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూపైనే రెస్పాండ్ అవుతూ.. ప్రముఖ సినిమా రైటర్ బీవీఎస్ రవి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘ఇదే ఇంటర్వ్యూ వంద ఏళ్ల క్రితం వస్తే రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఏభై ఏళ్ల క్రితం వెలివేసేవారు. ఇప్పుడు దాదాపుగా సమాజం బరితెగించడం వల్ల మీరు బతికిపోయారు ఆర్జీవీ’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ తలో రకంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్స్ పెడుతున్నారు. ఇక బీవీఎస్ రవి ట్వీట్ కు రిప్లై ఇచ్చిన ఆర్జీవీ కూడా దండం పెడుతున్న ఏమోజీలతో రీట్వీట్ చేశాడు. మరి ఆర్జీవీ ఇంటర్వ్యూ, దానిపై రైటర్ రవి ట్వీట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2022