చిత్ర పరిశ్రమలో ఒక సినిమా విడుదల అవ్వాలంటే ఎంతో కష్ట పడాలి. ఎలాంటి వివాదాలు లేకుండా మూవీ విడుదల అయితే అదే పదివేలుగా భావిస్తారు చిత్ర యూనిట్. కానీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క దర్శకుడి సినిమా మాత్రం వివాదం లేకుండా విడుదల కాదు. ఈపాటికే మీకు అర్థం అయిందనుకుంటా ఆ దర్శకుడు ఎవరో. అతడు మరెవరో కాదు టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తరచు వివాదాలతో తన చిత్రాలకు ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటాడు. దాంట్లో అతనికి అతడే సాటి. తాజాగా మరో వివాదంతో వర్మ వార్తల్లో నిలిచారు. మరి ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘లడ్కీ’ (ఎంటర్ ది గర్ల్ డ్రాగన్) అనే మూవీ మార్షల్ ఆర్ట్స్ ప్రధానాంశంగా తెరకెక్కించాడు. ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాల్సిందిగా కోర్టు నుంచి వర్మకు ఆదేశాలు వచ్చాయి. దీనికి కౌంటర్ గా వర్మ లడ్కీ సినీ నిర్మాత శేఖర్ రాజుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వర్మ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. శేఖర్ రాజు తనకు నగదు ఇవ్వాలని.. లడ్కీ చిత్రంపై తప్పుడు సమాచారంతో సివిల్ కోర్టులో ఆయన కేసు వేశారని ఆరోపించాడు. కోర్టును తప్పు దోవ పట్టించడంతో సినిమాను నిలుపుదల చేయాలని తాజాగా నాకు ఆదేశాలు అందాయని తెలిపారు.
లడ్కి సినిమా మీద పెట్టిన కేసుల గురించి ఇవాళ రాత్రి 9:00 గంటలకి టీవీ5 మూర్తి గారితో నా లైవ్ ఇంటర్వ్యూ
— Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2022
సినిమాపై 24 క్రాఫ్టులకు చెందిన కళాకారులు ఆధారపడి ఉన్నారని వారిని ఇబ్బందులకు గురి చెయ్యోద్దని వర్మ సూచించారు. నిర్మాత శేఖర్ రాజుకు తాను నగదు ఇవ్వాల్సిందేమి లేదని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఫిర్యాదులో కొరినట్లు వర్మ తెలిపారు. ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మపై అలాగే లడ్కీ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.