వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదోక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే వర్మ.. సోషల్ మీడియాలో ఎవరినీ వదలకుండా అందరినీ వివాదాల్లోకి లాగుతూ రచ్చ లేపుతుంటాడు. వర్మ తీసే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కంటే వివాదాల వరకే ఎక్కువగా ఆగిపోతుంటాయి. గత కొన్నేళ్లుగా తన మార్క్ సినిమాలు పక్కన పెట్టి.. అడల్ట్ కంటెంట్ వైపు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు వర్మ. అందులోనూ ఈ ఏడాది ఏకంగా ‘డేంజరస్’ అనే లెస్బియన్ మూవీని రిలీజ్ కి రెడీ చేశాడు. కొన్నాళ్ల క్రితమే థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన వర్మ.. కోర్టు స్టే విధించడంతో ఇన్నాళ్లు రిలీజ్ ఆపేశాడు.
తాజాగా సినిమా రిలీజ్ కి లైన్ క్లియర్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తెలుగులో ‘మా ఇష్టం’ అనే టైటిల్ తో డిసెంబర్ 9న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీస్ అప్సర రాణి, నైనా గంగూలీ మెయిన్ రోల్స్ ప్లే చేశారు. అయితే.. ప్రచార చిత్రాలు, సాంగ్స్, ట్రైలర్ లలో ఇద్దరు అమ్మాయిల మధ్య రొమాన్స్ ని ఎక్కువగా చూపించిన వర్మ.. సినిమాలో అదేం లేదని.. అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పుకొస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ కేవలం కొంతమంది అమ్మాయిలకు, మహిళా మీడియా ప్రతినిధులతో కలిసి డేంజరస్ సినిమా ఇంటర్వ్యూ అంటూ పిక్ షేర్ చేశాడు.
లెస్బియన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఇప్పటికే కేసులు, కోర్టులు తిరిగిన వర్మ.. ఏకంగా అన్ని అడ్డంకులు తొలగించుకొని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అయితే.. మా ఇష్టం మూవీ మన ఇండియన్ సంస్కృతికి విరుద్ధంగా ఉంది.. సినిమాని ఆపాలి అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు స్పందించిన వర్మ.. “ఇప్పుడీ ఇంటర్వ్యూకి వచ్చిన మీడియా ప్రతినిధులలో చాలామంది అమ్మాయిలే ఉన్నారు. సో.. ముందు మీరే ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూసి ఎలా ఉందో చెప్పండి. అంతేగాక ఇకపై మీరంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతారు’ అని చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ప్రెజెంట్ లేడీస్ మధ్య వర్మ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. వర్మ వ్యూహం అనే సినిమా ప్రకటించాడు. ఈ సినిమా మెయిన్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి తీయనున్నాడని, ఏపీ ఎలక్షన్స్ కి ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ సినిమా ఎలా తీయనున్నాడో తెలియదు గానీ.. ఈ లెస్బియన్ సినిమాతో మాత్రం మరోసారి వర్మ పేరు వివాదాలలో నిలవడం మార్మోగడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు. చూడాలి మరి డిసెంబర్ 9న వర్మ క్రియేట్ చేసిన లెస్బియన్ లవ్ స్టోరీ ఎంతవరకు జనాలు రిసీవ్ చేసుకుంటారో.. ఎలాంటి రెస్పాన్స్ అందుకోనుందో!
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2022
A group of girls interviewing me about DANGEROUS film ..It seems even women are connecting to a lesbian film pic.twitter.com/kFbKPfw8tm
— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2022