వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే అందరికి సోషల్ మీడియాలో ఆయన చేసే రచ్చే కనిపిస్తుంది. పైకి వర్మ అలా బ్యాడ్ బాయ్ లా కనిపిస్తాడు గానీ వ్యక్తిగతంగా ఎంతో మంచివాడని ఫ్యాన్స్ చెబుతుంటారు. వర్మ గురించి ఆయనతో సినిమాలు చేసినవారు కూడా ఎంతో పాజిటివ్ గా చెబుతుంటారు. కానీ.. సోషల్ మీడియాలో చూస్తే వర్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వ్యక్తిగతం పక్కన పెడితే.. వర్మ తీసే బోల్డ్ సినిమాలు, హీరోయిన్లకు సంబంధించి హాట్ ఫోటోలు, వివాదాస్పద ట్వీట్స్.. ఇలా అన్నీ అందరిలోనూ ఓ రకమైన కోపం కలిగిస్తుంటాయి.
వర్మ అసలు నిజస్వరూపం.. ఆయనను దగ్గరగా చూసినవారికి, ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్న వారికే అర్థం అవుతుంది.. అనేది మాత్రం వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే.. మనుషులు, మనుషుల మనస్తత్వాలను ఎవరూ అంత సులభంగా అర్థం చేసుకోలేరు. పైకి గంభీరంగా కనిపించేవారు కూడా వ్యక్తిగతంగా ఎంతో మంచి చేస్తుంటారు. వర్మ విషయంలో జరుగుతున్నవి అపార్థాలు.. అని చెప్పడానికి బిగ్ బాస్ ఫేమ్ ఇనాయ సుల్తానా లైఫ్ చాలు. ఆమె ట్రోల్ అవ్వడానికి వర్మ ఎంత కారణమయ్యాడో.. ఇప్పుడు ఆమె బిగ్ బాస్, సోషల్ మీడియాలో ఇంత ఫేమ్ అవ్వడానికి అంతే కారణం అయ్యాడనేది నిజం.
పైకి కనిపించేవే నమ్మి జడ్జి చేసే కాలంలో మనం జీవిస్తున్నాం. పైకి వర్మ పనికిరాని స్టఫ్ అంతా షేర్ చేస్తాడేమోగానీ.. వ్యక్తిగతంగా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టిన దాఖలాలు బయటికి రాలేదు. గతంలో ఇనాయ సుల్తానాతో వర్మ క్లోజ్ గా మూవ్ అయిన పిక్స్, వీడియోలు బయటికి రావడంతో ఆ అమ్మాయి లైఫ్ గురించి ఇంత రచ్చ జరిగిందేగానీ.. నిజానికి అక్కడ ఇద్దరిది తప్పులేదు. వాళ్ళు పర్సనల్ గా ఓ పార్టీలో డాన్స్ చేసిన వీడియోలు వాళ్ళకి తెలియకుండానే బయటికి వచ్చాయనేది గ్రహించాలి. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అమ్మాయి ఓ ఆట వస్తువు అయిపోయింది. ఆ వెంటనే ఆమెను ఫ్యామిలీ కూడా దూరం పెట్టింది.
కట్ చేస్తే.. వర్మ వల్ల ఇనాయకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దూరం అయ్యారని భావించిన వారందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అందుకు కారణం.. బిగ్ బాస్ షోలో ఇనాయ తన తల్లి ఒక్కటి కావడమే. ఇప్పుడు ఇనాయ గురించి అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి.. ఆ ఒక్క వీడియో వల్ల ఇనాయని ఎంతమంది దూరం పెట్టినా.. వర్మ దూరం నుండే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఇనాయ సెమి ఫైనల్స్ కి చేరుకోవడానికి వర్మ మద్దతు ప్రధాన కారణం. వర్మ ఓట్లు వేయించడం వల్లే ఇనాయ ఈరోజు ఇంత క్రేజ్, ఫేమ్ ని సంపాదించుకోగలిగింది.
ఒక మనిషి మీద విషం చిమ్మాలంటే ఏ కారణం అయినా ఉండొచ్చు. కానీ.. తన వల్ల అఫెక్ట్ అయిన అమ్మాయికి ఎల్లవేళలా సపోర్ట్ గా నిలిచి.. ఎవరి దృష్టిలో అయితే ఆమె నెగటివ్ అయ్యిందో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువమంది దృష్టిలో ఆమె స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసిన ఘనత వర్మకే దక్కుతుంది. కవర్ పేజీని పుస్తకాన్ని అంచనా వేయకుడనేది ఎంత వాస్తవమో.. వర్మ చేసే పనులను దృష్టిలో పెట్టుకొని.. అతని క్యారెక్టర్ ని విమర్శించడం పొరపాటే అవుతుంది. ఓ ఇనాయ లైఫ్ మలుపు తిరిగినా.. ఓ యాంకర్ బోల్డ్ నెస్ తో క్రేజ్ సంపాదించుకున్నా.. వీటన్నింటి వెనుక వర్మే ఉంటాడు. అది వాళ్ళు కూడా స్వచ్చందంగా ఒప్పుకునే వాస్తవం.. అవును, వర్మ ఒక మేధావి. చెడ్డోడులా కనిపించే మంచోడు! అతన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు.. అతను అర్థం చేసుకున్నట్లుగా వేరేవారు అర్థం చేసుకోలేరు అనడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ కోకొల్లలు.
Time to support @@inaya_sultana Login to Disney + Hotstar APP Search for BIGG BOSS NONSTOP CAST YOUR VOTE FOR inaya sulthana (10 Votes) Hotstar link https://t.co/hpGQHjZLev
7288877614 save as inaya give 10 missed calls to this number pic.twitter.com/62b20L9lWr
— Ram Gopal Varma (@RGVzoomin) November 23, 2022