బాలీవుడ్ లో బాయ్ కాట్ సెగ ఇంకా చల్లారలేదు. ఈ ఏడాది వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్ దగ్గర ఘెరంగా ఫెయిలయ్యాయి. ఈ మధ్య వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’.. హీరో అమిర్ ఖాన్ సినిమాల్లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ కి పెద్ద హిట్ అవసరం. అలాంటి హిందీ చిత్రసీమ.. భారీ బడ్జెట్ తో తీసిన ‘బ్రహ్మాస్త్ర’పై భారీ అంచనాలు పెట్టుకుంది. తెలుగులో దీన్ని ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా టాక్ ఏంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత బాలీవుడ్ సీన్ రివర్స్ అయింది. హిందీ సినిమాల్లో చాలావరకు ఫ్లాఫ్స్ అవుతూ వచ్చాయి. అదే టైమ్ లో సౌత్ సినిమాలు.. ఉత్తరాదిలో దుమ్మురేపాయి. బాహుబలి దగ్గర మొదలైన ఈ ట్రెండ్.. గత కొన్ని నెలల్లో వచ్చిన పుష్ప, RRR, కేజీఎఫ్ 2 వరకు కొనసాగింది. ఓవైపు మన సినిమాలు బాలీవుడ్ మార్కెట్ ని దున్నేస్తూ, వందల కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంటే.. మరోవైపు హిందీ సినిమాల్లో కంటెంట్ సరిగా లేకపోవడం, బాయ్ కాట్ సెగలు అక్కడి ఇండస్ట్రీని పూర్తిగా డౌన్ చేశాయి.
ఇలాంటి సమయంలో రణ్ బీర్-ఆలియా హీరోహీరోయిన్లుగా తీసిన ‘బ్రహ్మాస్త్ర’ వచ్చింది. పురాణాలు, అస్త్రాలు ఆధారంగా తీసిన కల్పిత కథే ఈ చిత్రం. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు అనేసరికి అంచనాలు బాగానే పెరిగాయి. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ దారుణమైన రివ్యూ ఇచ్చాడు. తనని పూర్తిగా నిరాశపరిచిందని 2 స్టార్స్ రేటింగ్ ఇచ్చాడు. వీఎఫ్ఎక్స్ విషయంలో దృష్టి పెట్టారు గానీ కంటెంట్ లోపించింది అన్నాడు. సినిమాలో సోల్ మిస్సయిందని కూడా చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘బ్రహ్మాస్త్ర’పై మీ అభిప్రాయం ఏంటి.. కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!
#OneWordReview…#Brahmāstra: DISAPPOINTING.
Rating: ⭐⭐#Brahmāstra is a king-sized disappointment… High on VFX, low on content [second half nosedives]… #Brahmāstra could’ve been a game changer, but, alas, it’s a missed opportunity… All gloss, no soul. #BrahmāstraReview pic.twitter.com/5EOKJrtbiY— taran adarsh (@taran_adarsh) September 9, 2022