నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, నేహ శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్
కథ, స్క్రీన్ ప్లే: సిద్దు జొన్నలగడ్డ, విమల్ కృష్ణ
సంగీతం: శ్రీ చరణ్ పాకల, రామ్ మిర్యాల, తమన్(బాక్గ్రౌండ్ మ్యూజిక్)
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ.
కథ:
బాలగంగాధర్ తిలక్ అలియాస్ DJ టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. అన్ని లోకల్ ఫంక్షన్లలో డీజే మెయింటైన్ చేస్తూ గడిపేస్తుంటాడు. ఓరోజు పబ్ లో సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే.. కొద్దిరోజులకు రాధిక అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఆ టైంలో రాధికకు హెల్ప్ చేయడానికి వెళ్లి టిల్లు కూడా మర్డర్ కేసులో భాగమవుతాడు. మరి ఆ మర్డర్ కేసు నుంచి డిజే టిల్లు ఎలా బయటపడ్డాడు..? అసలు మర్డర్ కేసుకు రాధికకు ఏంటి సంబంధం..? ఇద్దరూ ఎలా బయటపడ్డారు..? అనేది అసలు కథ.
కథనం:
ఇటీవల జనాలను చిల్ చేసే సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి డీజే టిల్లు. కథ లేకపోయినా మంచి కామెడీ, స్క్రీన్ ప్లేతో మెప్పిస్తే చాలు అనుకుంటున్నారేమో. కరెక్ట్ గా చెప్పాలంటే జాతిరత్నాలు సినిమాలాంటిదే ఈ డీజే టిల్లు. సినిమాను మంచి కామెడీతో స్టార్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా రేసి స్క్రీన్ ప్లేతో హిలేరియస్ గా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లోనే కాస్త నెమ్మదించింది. సెకండ్ హాఫ్ లో స్టోరీ పరంగా లోటు తెలుస్తుంది. స్టోరీ పాయింట్ అదిరింది కానీ దానికి సెకండ్ హాఫ్ లో పూర్తి న్యాయం చేయలేకపోయారు.
విశ్లేషణ:
సినిమాలో డీజే టిల్లుగా సిద్ధు పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. హిలేరియస్ డైలాగ్స్ తో సినిమాలో తన రైటింగ్ మార్క్ చూపించాడు. తానే కథ, స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పూర్తిగా పాత్రలో లీనమైపోయాడు. రాధికగా నేహాశెట్టి బాగా నటించింది. సహాయ నటుల పాత్రలకు ప్రిన్స్, బ్రహ్మజీ, నర్రా శ్రీనివాస్.. అంతా న్యాయం చేశారు. సినిమాలో శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల సాంగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఇక సినిమాకి తమన్ నేపథ్య సంగీతం పెద్ద ఎస్సెట్. స్టార్ హీరోల సినిమాలకి వాయించినట్లుగా మోత మోగించాడు. కొన్ని సీన్లను బిజీఎంతో హైలైట్ చేశాడు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వేల్యూస్ హై లెవెల్ లో ఉన్నాయి. డైరెక్టర్ పూర్తిగా న్యాయం చేసాడని చెప్పవచ్చు. 2 గంటలలోపే సినిమా నిడివి ఉండటం డీజే టిల్లుకి ప్లస్ అయింది.
Tillu Anna DJ పెడితే BLOCKBUSTER అయితది అంతే!..🤙💥
Experience the Hilarious Fun-Ride at theatres near you! 🤩🥁#BlockbusterDJTillu 🤩#DJTillu @Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala #RamMiriyala @SitharaEnts @Fortune4Cinemas pic.twitter.com/qzbVt0wHUH
— Suman TV™ (@SumanTvOfficial) February 12, 2022
ప్లస్ లు:
మైనస్ లు:
చివరిమాట:
డీజే టిల్లు.. మోత అదిరింది!
రేటింగ్: 3/5
#DJTillu Hungama begins in style at Sudarshan Theatre 🤩💥
Watch it in your nearest theatres now! 🥳@Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @SricharanPakala @vamsi84 @Fortune4Cinemas @SitharaEnts @adityamusic pic.twitter.com/LmXeD4yIOW
— Suman TV™ (@SumanTvOfficial) February 12, 2022
Experience the Fun, Madness & Love in cinemas near you!🥳🤙#DJTilluFromToday 🤩#DJTillu @Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @SricharanPakala @vamsi84 @Fortune4Cinemas @venupro @SitharaEnts @adityamusic pic.twitter.com/GM8BeYHmqU
— Suman TV™ (@SumanTvOfficial) February 12, 2022
$100K+ & counting for #DJTillu from USA premieres 💥🥳
Overseas Release by @Radhakrishnaen9
Watch it in your nearest theatres now! 🥳#DJTilluFromToday 🤩@Siddu_buoy @iamnehashetty @K13Vimal @MusicThaman @vamsi84 @SricharanPakala @SitharaEnts @Fortune4Cinemas pic.twitter.com/IWU304e1fB
— Suman TV™ (@SumanTvOfficial) February 12, 2022