నటీనటులు: నాని, నజ్రియా నజీమ్, నరేష్, అజగం పెరుమాల్, నదియా, రోహిణి, అనుపమ పరమేశ్వరన్, తన్విరామ్, హర్షవర్ధన్ తదితరులు
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నీకేత్ బొమ్మి
నిర్మాతలు: వై రవి శంకర్, సీవీ మోహన్
రచన – దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
Ante Sundaraniki Movie Review: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సరిసమానంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కలిగివున్న హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకరు. గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’ లాంటి సీరియస్ సబ్జెక్టుతో సినిమా తీసి హిట్టు కొట్టిన నాని.. ఇప్పుడు మళ్లీ తన వేలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికి’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయాడు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి క్లాస్ హిట్స్ తీసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.. నానితో అంటే సుందరానికి తెరకెక్కించారు. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మలయాళం బ్యూటీ నజ్రియా నజిమ్ ఈ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేస్తోంది. ఇక ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో భారీ అంచనాలు క్రియేట్ చేసిన అంటే సుందరానికి చిత్రం.. తాజాగా విడుదలై ప్రేక్షకులను ఎంతవరకు రీచ్ అయ్యిందో రివ్యూలో చూద్దాం!
సుందర్ ప్రసాద్(నాని) పక్కా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. మూఢనమ్మకాలను బాగా నమ్మే శాస్త్రి(నరేష్)గారి ఫ్యామిలీకి ఉన్న ఒకే ఒక్క వారసుడు. ప్రతి చిన్న విషయంలో సుందర్ కుటుంబం చిన్నప్పటి నుండి వేధిస్తూ ఉంటుంది. ఆ బాధలు భరించలేక సుందర్.. అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కానీ.. సుందర్ జాతకంలో చిక్కులు, గండాల కారణంగా పేరెంట్స్ ఆపేస్తారు. అదే సమయంలో సుందర్.. ఫోటోగ్రాఫర్ లీలా థామస్(నజ్రియా)ను చూసి ఇష్టపడతాడు. ఆమెతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ.. లీలా క్రిస్టియన్ అని అటు సుందర్ ఫ్యామిలీ.. సుందర్ హిందూ అని లీలా పేరెంట్స్ ఒప్పుకోరు. దీంతో సుందర్ – లీలా వేరే ఆప్షన్ లేక ఓ షాకింగ్ నిర్ణయానికి వస్తారు. అక్కడి నుండి అసలు ట్విస్టులు మొదలవుతాయి. మరి సుందర్ లీలా ఎలా ఒక్కటయ్యారు? వారి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? వారిద్దరూ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటి? పేరెంట్స్ లో ఉన్న రిలీజియన్ ఫీలింగ్ ని మార్చారా లేదా? అనేది తెరపై చూడాల్సిందే.
హీరో నాని యాక్టింగ్ ఎంతబాగా చేస్తాడో.. కామెడీ కూడా అంతేబాగా చేస్తాడనే సంగతి అందరికి తెలుసు. నాని సినిమా అంటే మినిమమ్ ఫన్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్నీ కలగలసి ఓ మంచి ఫ్యామిలీ స్టోరీని ఎక్సపెక్ట్ చేస్తుంటారు. బేసిగ్గా నాని ఫ్యామిలీ స్టోరీస్ తోనే ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ కూడా నానికి బాగా కలిసి వస్తుందని అంటుంటారు. అయితే.. చాలా రోజుల తర్వాత నాని పూర్తిగా డిఫరెంట్ ఫన్ రోల్ లో కనిపించాడు. ‘అంటే సుందరానికి’ అనే టైటిల్ తోనే ఫస్ట్ స్టేజ్ అటెన్షన్ సొంతం చేసుకున్నాడు. పూర్తి ఫన్ అండ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఫస్ట్ హాఫ్ ఎప్పటిలాగే నాని మార్క్ కామెడీ టైమింగ్ తో.. ఎంటర్టైన్ చేస్తుంది.
ముఖ్యంగా నాని చుట్టూ ఉండే పాత్రలు.. పేరెంట్స్, స్కూల్, ఆఫీస్ ఇలా అన్నీ కంప్లీట్ ఫన్ తో రాసుకున్నారు దర్శకుడు వివేక్. ఎంత నాని సినిమా అయినా.. వివేక్ తన మార్క్ ఎమోషన్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు. పూర్తి విభిన్నమైన రెండు సంప్రదాయాలకు, ఆచారాలకు చెందిన ఇద్దరినీ కలిపే దిశగా ఓ లవ్ స్టోరీ క్రియేట్ చేశారు. హిందూ, క్రిస్టియన్ అనే రెండు రిలీజియన్ ఫీలింగ్స్ ని చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా సుందర్, లీలా ఇంట్రడక్షన్ లతో పాటు.. వారి లైఫ్ స్టైల్, ఫ్యామిలీ బాక్గ్రౌండ్స్ ని పరిచయం చేస్తూ ఫన్ యాడ్ చేసి చూపించారు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ సమయానికి ఓ షాకింగ్ ట్విస్టుతో టెన్షన్ క్రియేట్ చేశారు.
ఇక అసలు కథ అంతా సెకండాఫ్ లోనే ఉంటుంది. సుందర్ – లీలా తీసుకున్న డెసిషన్ కారణంగా రెండు ఫ్యామిలీస్ లో కలవరం మొదలవుతుంది. దాని నుండి బయటపడే క్రమంలో రెండు మతాలు అడ్డొచ్చి.. ఏమి తోచని స్థితికి వీరి పరిస్థితి చేరుకుంటుంది. ఇలా సీరియస్ సబ్జెక్టుని కూడా మంచి ఫన్ తో, కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ఇక క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్.. గుండెను హత్తుకునేలా.. ఓ ప్రేమలో ఎదుర్కొంటున్న పెద్ద సమస్య గురించి ఆలోచించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమా నిడివి మూడు గంటలు ఉన్నప్పటికీ.. ఆ ఫీల్ రాకుండా డీల్ ఎంటర్టైన్మెంట్ తో డీల్ చేశారు. కానీ ఇంటర్వెల్ ముందు, క్లైమాక్స్ ల ముందు సినిమా లెన్త్ విషయంలో ఎక్కువుందనే ఫీల్ ప్రేక్షకులకు కలగవచ్చు.
ఇక సుందర్ పాత్రలో నాని మరోసారి చెలరేగిపోయాడు. తన కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. సుందర్ పాత్రలోని చిన్న చిన్న వెరీయేషన్స్ చక్కగా చూపించాడు. హీరోయిన్ నజ్రియా తమిళ డబ్బింగ్ చిత్రం ‘రాజారాణి’తో తెలుగు ఫ్యాన్స్ కు బాగా దగ్గరైంది. ఆమె ఎప్పుడెప్పుడు తెలుగులో సినిమా చేస్తుందా అని వెయిట్ చేస్తున్న టైమ్ లో.. లీలాగా ఫ్యాన్స్ ముందుకొచ్చింది. డెబ్యూ అయినప్పటికీ.. నజ్రియా ప్రేక్షకులకు కొత్తమ్మాయిలా అనిపించదు. లీలా థామస్ పాత్రకు తనవరకు న్యాయం చేసింది. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్ చక్కగా పలకడమే కాకుండా.. తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. నానితో కెమిస్ట్రీ కూడా బాగా పండించింది.
సీనియర్ నటుడు నరేష్ సుందర్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. చాలా కొత్తగా, ఎన్నో ఎమోషన్స్ తో కూడిన పాత్ర చేశారు. ఖచ్చితంగా ఆయన కెరీర్ లో చేసిన బెస్ట్ రోల్స్ ఇదొకటి అని చెప్పవచ్చు. సుందర్ తల్లిగా రోహిణి, లీలా పేరెంట్స్ గా నదియా, పెరుమాల్ క్యారెక్టర్స్ ని ఓన్ చేసుకొని మెప్పించారు. ఇక సినిమాలో స్పెషల్ రోల్ సోనాలిగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. లీలా సోదరిగా తన్విరామ్, సుందర్ మేనేజర్ గా హర్షవర్ధన్, ఫ్రెండ్ గా రాహుల్ రామకృష్ణ పర్వాలేదనిపించారు. సినిమాలో నటించిన మిగతా నటులంతా పాత్ర పరిధిమేరకు న్యాయం చేశారు.
లవ్, కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలంటే కథాకథనాలు కొత్తగా కోరుకుంటారు. లేదా కథ పాతదే అయినా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. డైరెక్టర్ వివేక్.. స్క్రీన్ ప్లేలో కొన్నిసార్లు సింపుల్ స్టోరీ అనిపించినా.. తన మార్క్ నేరేషన్ తో ట్విస్టులు, అటెన్షన్ క్రియేట్ చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో కథలో మలుపులు, ఎమోషనల్ మూమెంట్స్ బాగా కుదిర్చాడు. స్టోరీలో క్యారెక్టర్స్ డీటెయిలింగ్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ నికేత్ విజవల్స్.. వివేక్ సాగర్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మేజర్ ప్లస్ లు. ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటుంది. మైత్రి మూవీస్ వారి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. మొత్తానికి మంచి కామెడీ, లవ్, ఎమోషన్స్ తో అంటే సుందరానికి సినిమాను మేకర్స్ రోలర్ కోస్టర్ లా తెరకెక్కించారు. సినిమాలో అన్నీ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. నాని ఖాతాలో మరో హిట్టు పడిందని చెప్పవచ్చు.
ప్లస్ లు:
మైనస్ లు:
చివరి మాట: అన్ని వర్గాలను మెప్పించగలిగే.. అంటే సుందరానికి!
రేటింగ్: 3/5