Review Laxman: వివాదాల నడుమే విశ్వక్ సేన్ ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు హంగామా చేస్తున్నారు. రివ్యూ లక్ష్మణ్ కూడా ఈ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద శుక్రవారం ఉదయం సందడి చేశాడు. ఏకంగా జ్యూస్ క్యాన్‌తో రంగంలోకి దిగాడు. సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ బ్రో నిజంగా చెప్తున్నాను.. ఆడ వాళ్లకోసం ఎంత మంచిగా చెప్పాడు బ్రో అన్న. ఎంత మంచి మెసేజ్ ఇచ్చాడు. ఈ సినిమా బాగోలేకపోతే నిజంగా పోసుకుంటా( జ్యూస్ క్యాన్‌పైకి ఎత్తుతూ). ప్రతీ ఒక్కరు కుటుంబంతో కలిసి సినిమా చూడండి. ప్రతీ ఒక్కరికీ నచ్చే సినిమా. మీసం మెలేసిమరీ చెబుతున్నా… సూపర్ సినిమా.
‘‘వెంకటేష్ సినిమా నాగవల్లి.. థియేటర్‌లో ఫ్యాన్స్ చేస్తున్నారు లొల్లి’’.. బ్రో.. ‘‘కేజీఎఫ్ సినిమాలో ఉంది రమికా సేన్.. ఇరగాదీసాడయ్యా మా విశ్వక్ సేన్’’. ఆంధ్రా, తెలంగాణ కమల్ హాసన్’’ అంటూ విశ్వక్ సేన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా, విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. మరి, లక్ష్మణ్ రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vishnu Manchu: విశ్వక్ సేన్ కోసం మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్!