చలన చిత్ర పరిశ్రమలో నటీ, నటులు తమ సహ నటులపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలా కొన్ని కామెంట్స్ వివాదాలకు సైతం దారి తీస్తూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో RRR మూవీ పై కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి. తాజాగా ఆయన మరోసారి హీరో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రసూల్ పూకుట్టి.. ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇటీవల RRR మూవీని ‘గే’ చిత్రంగా వర్ణించాడు. దాంతో ఒక్కసారిగా నెటిజన్స్ ఆయన పై మండిపడ్డారు. అప్పట్లో ఆ ట్విట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ సౌండ్ డిజైనర్ టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ పై స్పందించాడు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
రసూల్ పూకుట్టి స్పందిస్తూ..” ప్రభాస్ నిజంగానే డార్లింగ్ ఎందుకంటే, అతడు తన చుట్టూ ఉన్న వారిని గౌరవిస్తాడు, నమ్ముతాడు. అలాగా తన ప్రపంచాన్ని తానే సృష్టించుకొగల సమర్థుడు. అలాగే అతనికి వృత్తి పట్ల నిబద్ధత ఎక్కువ. ఇవే అతని విజయాలకు ప్రధాన కారణాలు అని, తాను ప్రభాస్ ని అందుకే అమితంగా ప్రేమిస్తానని” రసూల్ పూకుట్టి రాసుకొచ్చాడు. ప్రభాస్ చిత్రం రాధే శ్యామ్ కోసం రసూల్ పని చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తమ అభిమాన నటుడిపై ఆస్కార్ గెలిచిన ప్రముఖ వ్యక్తి ప్రశంసలు కురింపిచడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ప్రభాస్ పై రసూల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Prabhas is an absolute darling and a great professional to work with. He respects and trust his technicians and in their ability to create a world around him, the foremost reason for his success. He submit himself to the vision of his people… I love him dearly… https://t.co/tBlwqVqQBv
— resul pookutty (@resulp) August 1, 2022
ఇదీ చదవండి: పొట్టి గౌనుతో బెల్జియం వీధుల్లో హరితేజ హాట్ డ్యాన్స్!
ఇదీ చదవండి: మంచు విష్ణుపై జయసుధ కామెంట్స్! చాలా అసహ్యంగా ఉందంటూ..!