సినిమా ఇండస్ట్రీలోని వాళ్ల గురించి.. ముఖ్యంగా హీరోయిన్లు, నణీమణుల గురించి తప్పుడు వార్తలు రావటం తరచుగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోని ఆడవాళ్ల వీడియోలను మార్ఫ్ చేసి, సొమ్ము చేసుకుంటూ ఉన్నారు కొందరు దుర్మార్గులు. టాప్ హీరోయిన్ల దగ్గరినుంచి ఔత్సాహిక నటీమణుల వరకు ఎవ్వరినీ వదలకుండా మార్ఫింగ్ వీడియోలు చేసి బూతు సైట్లలో పెట్టేస్తున్నారు. తమవి కాని, ఆ వీడియోల ద్వారా ఎంతో మంది మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. ప్రాణాలు కూడా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఆయా ఇండస్ట్రీలలో టాప్‌లో ఉన్న వారి కుటుంబసభ్యుల్ని కూడా కొంతమంది వదలటం లేదు. ఇదే పరిస్థితి ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ చెల్లెలు రేష్మకు ఎదురైంది. ఎవరో ఆమె మార్ఫింగ్ వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టారు.
దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అందరూ దాని గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. చివరకు కుటుంబసభ్యులు కూడా ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత ఆ వీడియో తనది కాదని తేలటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఈ సంఘటనపై రేష్మ తాజాగా, ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ రేష్మ పసుపులేటి హాట్ సెక్స్ వీడియో లీక్‌డ్ అని ఓ వీడియో వైరల్ అయింది. అది కూడా సుచీ లీక్స్ పేరిట వచ్చిందని ఉంది. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. నా సోదరి నాకు ఫోన్ చేస్తూ ఉంది. ‘నీ సెక్స్ వీడియో లీక్ అయింది’ అని నాతో చెప్పింది. నేను అప్పుడు ‘నా సెక్స్ వీడియో లీక్ అయిందా?’.. నేను ఊర్లోనే లేనే.. వేరే దేశంలో ఉన్నానే.. నాకు అసలు లవర్ లేడు.. మరి ఎలా వస్తుంది అనుకున్నాను.
నాకు అర్థం కాలేదు. మా అమ్మ నన్ను నేరుగా అడగలేక నా చెల్లెలితో ఫోన్ చేయించింది. మా నాన్న ఓ ప్రొడ్యూసర్, మా తాత ప్రొడ్యూసర్, మా అన్న నటుడు.. ఈ ఫీల్డ్‌లో వాళ్లు ఉన్నారు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. వేరే వాళ్లు అయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. ఆ మనో వేదనను తట్టుకోలేకపోయేవారు. మా వాళ్లు కాబట్టి చాలా మంచిగా వ్యవహరించారు. ఆ వీడియోను నాకు పంపమని మా చెల్లెలితో చెప్పాను. నా బాడీ గురించి నాకు తెలుసు కదా… ఆ వీడియో చూశాను. ఆ అమ్మాయి నాకంటే చాలా బాగుంది. సత్యంగా అది నేను కాదు.. మా అమ్మ, చెల్లెలు అది తెలిసి నవ్వుకున్నాం. అది వేరే వాళ్లకు ఎంత మనో వేదనను కలిగిస్తుంది. సాధారణ అమ్మాయిలు అయితే ఆత్మహత్య చేసుకునే వారు’’ అని అన్నారు.
What a strong women 🔥🔥🔥🔥 pic.twitter.com/iYX7zoChLN
— Vishnu® (@Vishnu1310) December 29, 2022