ఆస్కార్ ఈవెంట్ కి వెళ్ళడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఫ్రీ ఎంట్రీ లేదా? కీరవాణి, చంద్రబోస్ లకు ఫ్రీ పాస్ లు ఇచ్చారు గానీ మిగతా వారికి ఇవ్వలేదు. దీంతో లక్షలు ఖర్చు పెట్టి ఆస్కార్ ఈవెంట్ టికెట్లు కొనుక్కోవాల్సి వచ్చిందట.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజిల్స్ లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ మెరిశారు. అయితే ఈ ఆస్కార్ ఈవెంట్ కి కేవలం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ లను మాత్రమే ఆహ్వానించారట. ఎందుకంటే నాటు నాటు పాట ఆస్కార్ నామినీస్ గా ఈ ఇద్దరు మాత్రమే ఎంపికయ్యారు. ఒకరు సంగీత దర్శకుడు, మరొకరు లిరిక్ రైటర్ కాబట్టి వీరిని మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఆస్కార్ ఈవెంట్ కి హాజరవ్వడానికి ఆస్కార్ నామినీస్ కి మాత్రమే ఫ్రీ పాస్ లు ఇస్తారని.. నామినీతో పాటు ఆ వ్యక్తి కుటుంబం నుంచి ఒకరు హాజరవ్వచ్చునని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా తీసింది రాజమౌళి అయినా, నాటు నాటు పాట అంత గొప్పగా రావడానికి కారణం రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లు అయినా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా పాటను మాత్రమే ఎంపిక చేశారు కాబట్టి పాటలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న సంగీత దర్శకుడు, గీత రచయిత చంద్రబోస్ ను ఆహ్వానించారు. అయితే వీరు ఆస్కార్ నామినీస్ కాబట్టి వీరికి ఫ్రీ ఎంట్రీ ఉందని.. ఫ్రీ పాస్ లు ఇచ్చినట్లు సమాచారం. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆహ్వానించలేదట. వీళ్లకు వీళ్ళే ఆస్కార్ ఈవెంట్ కి వెళ్లడం కోసం లక్షలు ఖర్చు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 95వ అకాడమీ అవార్డుల ఈవెంట్ కి వెళ్లాలంటే ఒక పర్సన్ 25 వేల డాలర్లు ఖర్చు పెట్టి టికెట్లు కొనాలట. మన కరెన్సీ ప్రకారం 20 లక్షల 64 వేలు పైనే.
అలా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఒక్కో టికెట్ కోసం రూ. 20 లక్షలు ఖర్చు పెట్టినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే రాజమౌళి తన కోసం, తన టీమ్ మెంబర్స్ కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించి టికెట్లు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వడం.. ఈ ఆనంద క్షణాలను చిత్ర బృందంతో కలిసి జరుపుకోవాలనే.. రాజమౌళి తన సొంత డబ్బు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ కుటుంబ సభ్యుల కోసం స్వయంగా టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.
అదండి విషయం.. ఆస్కార్ ఈవెంట్ కి హాజరవ్వాలంటే 20 లక్షలు పైనే ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కోవాలట. ఈ లెక్కన రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, కాలభైరవ, రామ్ చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి ఇలా చాలా మంది వెళ్లి ఉంటారు. వీరందరికీ అయిన ఖర్చు ఊహించుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది కదూ. కానీ ఆస్కార్ ముందు ఈ ఖర్చు ఎంత చెప్పండి.. జుజుబీ. అంతర్జాతీయ వేదిక మీద కూర్చుని ఆస్కార్ అవార్డుని పట్టుకుంటే ఆ అనుభూతే వేరు. ఆ అనుభూతి కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.