మహానటి కీర్తి సురేష్ పెళ్ళి పీటలెక్కనుందా? అంటే అవుననే వినిపిస్తోంది. దివంగత నటి ‘సావిత్రి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కీర్తీ సురేష్.. చాలా కాలంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇన్నాళ్లు కథలు నచ్చక దూరంగా ఉంటోందనుకుంటున్న అభిమానులకు మహానటి అనుకోని షాక్ ఇచ్చింది. సినిమా ప్రమోషన్లలో చెప్పినట్లుగానే మనసుకు నచ్చినవాడిని మనువాడడానికి సిద్ధమైపోయింది. ఈ విషయం గురించి కీర్తి సురేష్ తల్లి మేనక మీడియాకు లీకులు ఇచ్చిందట.
రంగుల ప్రపంచమైన సినీ ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరోయిన్లు పెళ్లి గురించి ఆలోచించే వారు కాదు. మేల్ డామినేషన్ ఉన్న సినీ పరిశ్రమలో, హీరోలు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్లేదు కానీ, హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కితే మాత్రం అవకాశాలు తగ్గిపోయేవి. దీంతో సీనియర్స్ హీరోయిన్స్ పెళ్ళిళ్ళు చాలా లేట్ గా అయ్యేవి. అయితే ఇప్పుడు రోజులు మారాయి. నేటి హీరోయిన్ల ఆలోచన శైలి కూడా మారింది. కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడే పెళ్ళి చేసేసుకుని, వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, నయనతార.. ఇలా అడుగుపెట్టిన వారే. ఈ లిస్టులోకి కీర్తి సురేష్ కూడా చేరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం చూస్తే, వచ్చే ఏడాది ప్రధమార్థంలో మహానటి పెళ్ళి పీటలెక్కబోతోందట. కీర్తి సురేష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ యువ పారిశ్రామికవేత్తతో ఆమె పెళ్లి జరగనుందట. అతను విదేశాల్లో వుంటాడని తెలుస్తోంది.
అయితే ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపడేస్తున్నారు.. ఆమెతో పరిచయం ఉన్నవారు. ఆమె ఫోకస్ మొత్తం సినీ కెరీర్ పైనే ఉందని, వారి కుటుంబంలో ఇలాంటి చర్చలే జరగడం లేదని అంటున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కోలీవుడ్ సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కీర్తి సురేష్ లు డేటింగ్ చేస్తున్నారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా వినిపించింది. అయితే కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఆ వార్తల్ని ఖండించారు. అయితే ఇప్పుడు ఏకంగా, ఓ వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ పెళ్లి అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడం హాట్ టాపిక్ గా మారింది.