'మైత్రీ మూవీ మేకర్స్' అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో కుటుంబసభ్యులు స్పందించి ఆయనకు ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్‘ అధినేత, ప్రధాన భాగస్వామి నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. ఇబ్బంది పడుతున్నట్లు అనిపించడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఛాతీలో అనీజీగా ఉందనిచెప్పడంతో వైద్యులు గుండె సంబంధిత పరీక్షలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిందేదీ లేదని కుటుంబసభ్యులు తెలుపుతున్నారు. ఒకపక్క ఐటీ రైడ్స్.. మరోపక్క నవీన్ యెర్నేనికి అస్వస్థతకు గురికావడం చిత్రపరిశ్రమను గందరగోళంలోకి నెట్టేసింది.
గత రెండు రోజులుగా ఇన్ కమ్‌టాక్స్ అధికారులు.. దర్శకుడు సకుమార్ సహా మైత్రీ మూవీస్ భాగస్వాములు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్‌లతో సహా మైత్రి మూవీ మేకర్స్, దాని ప్రమోటర్ల కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హవాలా మార్గంలో నిధుల మళ్లింపు ద్వారా ప్రమోటర్లు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. కాగా, 2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మూవీస్ సంస్థ.. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం మైత్రీ మూవీస్ బ్యానర్ పై ‘పుష్ప 2: ది రూల్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఎన్టీఆర్31’, ‘ఆర్సీ16’ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.
Mythri Movie Makers నిర్మాత ఎర్నేని నవీన్‌కు అస్వస్థత – TV9 #naveenyerneni #MythriMovieMakers #TV9Telugu pic.twitter.com/clU41q39ie
— TV9 Telugu (@TV9Telugu) April 21, 2023