18 ఏళ్లు దాటిన తర్వాత అకీరా నందన్ చేసిన ఓ గొప్ప పనిని తల్లి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంది. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అకీరా మొదటిసారి రక్తదానం చేశాడు. ఆ విషయం చెబుతూ ‘18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా తొలిసారి రక్తదానం చేశాడు. రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయం. మనం ఇచ్చే రక్తం అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది. 18 ఏళ్లు దాటిన తర్వాత అందరూ మీకు కుదిరినప్పుడు మీ వీలుని బట్టి రక్తదానం చేయండి. మీ రక్తం ఎవరి జీవితాన్ని కాపాడుతుందో ఎవరికీ తెలియదు’ అంటూ రేణూ దేశాయ్ అకీరా ఫొటో పోస్ట్ చేసింది.
ఇదీ చదవండి: పుష్ప-2పై కేజీఎఫ్ 2 ఎఫెక్ట్! సుకుమార్ స్టోరీ మార్చబోతున్నాడా?
అకీరాని చూసి మెగా ఫ్యాన్స్.. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే పవన్ మొదటి నుంచి ఎంతో భిన్నంగా ఉండేవాడు. సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల, తోటివారి అభివృద్ధి పట్ల ఎంతో ఆలోచిస్తూ ఉండేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా సమాజానికి తనవంతుగా సహాయం చేస్తుండేవాడు. ఇప్పుడు అకీరాలోనూ అలాంటి లక్షణాలు చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆహార్యంలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ పవన్ వారుసుడని ప్రశంసిస్తున్నారు. అకీరా విషయం రేణూదేశాయ్ కూడా ఎన్నోసార్లు పొగుడుతూ పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఇంక అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంలో మాత్రం ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే అకీరా సినిమాల్లోకి వస్తున్నాడని చాలాసార్లు పుకార్లు వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారి రేణూ క్లారిటీ ఇస్తూ వచ్చింది. ఇటీవల అకీరా బాక్సింగ్ చేస్తున్న వీడియో పెట్టినప్పుడు కూడా సినిమాల కోసమే కసరత్తులని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మళ్లీ ఆ వీడియోపై రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అకీరా సినిమాల్లోకి రావడం లేదు, అతని డెబ్యూ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.. వస్తున్న పుకార్లను నమ్మకండి అని ప్రత్యేకంగా చెప్పింది. మొదటిసారి అకీరా రక్తదానం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.