పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కి సినిమాల్లోకి రాకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అకీరాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ ఉన్నా తల్లి రేణుదేశాయ్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా అకీరా బర్త్ డే వచ్చిందంటే.. మెగా ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. అయితే.. తాజాగా అకీరా బర్త్ డే సందర్భంగా తల్లి రేణుదేశాయ్ ఓ వీడియో షేర్ చేసింది.
ఆ వీడియోలో అకీరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. బాక్సింగ్ చేస్తున్న అకీరాను చూసి మెగాఫ్యాన్స్ ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. అదేంటంటే.. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అకీరాను చూస్తే.. పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తున్నాడని అంటున్నారు. అందులోనూ ఆయన నటించిన జానీ, తమ్ముడు సినిమాలను కామెంట్స్ లో మెన్షన్ చేస్తున్నారు నెటిజన్లు.అదేవిధంగా అకీరా త్వరలోనే సినిమాల్లోకి డెబ్యూ చేయనున్నాడేమో అంటూ పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వీడియో షేర్ చేసిన రేణుదేశాయ్.. అకీరా సినీ ఎంట్రీపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసింది. అకీరాకి యాక్టర్ అయ్యే ఆలోచన లేదని, అలాగే ఏ సినిమాలను ఓకే చేయట్లేదని.. అకిరా డెబ్యూ పై వస్తున్న రూమర్లను ఏమాత్రం నమ్మొద్దని చెప్పేసింది రేణుదేశాయ్. ప్రస్తుతం రేణుదేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి అకీరా వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.