తన తండ్రి ఎత్తుకున్న పిల్లాడు ప్రముఖ టాలీవుడ్ హీరో. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు నటుడు. టాలీవుడ్ కి పాన్ ఇండియా పదాన్నిపరిచయం చేసిన హీరో.
మన కన్న తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. ఎందుకంటే దైవాన్ని తలచుకుంటే మనకు కావలసినవి జరుగుతాయని నమ్మకం. అలాగే మన తల్లిదండ్రులతో మనం మంచిగా నడుచుకోవాలి. వారి మనసు కష్టపెట్టకుండా, వారికి అనుగుణంగా నడుచుకున్నపుడు మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతాం. వారి దీవెనలు ఎల్లపుడు మనపై ఉండాలి. చిన్నపుడు బడిలో నేర్చుకున్న మాట ‘కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు.. నష్టపెట్టబోకు నాన్న పనులు’ అన్నరీతిలో అమ్మనాన్నలతో ప్రేమతో మెలగాలి. తల్లి జన్మనిస్తే.. నాన్న బతుకు నడక నేర్పుతాడు. అమ్మ ప్రేమ ప్రతి విషయంలో బహిర్గతమవుతుంది. మాటల ద్వారా వ్యక్తమవుతుంది. కానీ నాన్నప్రేమ వ్యక్తపరచకుండా జీవితంలో బాధ్యతలను నేర్పిస్తాడు. మనల్ని వెన్నంటి ఉండి మన గెలుపుకు కారణమవుతాడు నాన్న. నిరంతరం మన జీవిత గమ్యం వైపు నడిపించే బాటసారి నాన్న. మనకోసం నాన్న చేసిన త్యాగాలను వెలకట్టలేం. మన బాగుకోసం నిరంతరం పరితపించే నాన్న ప్రేమ నిస్వార్థమైనది. మన జీవితానికి గొప్ప అంగరక్షకుడు నాన్న. అటువంటి ఫాదర్స్ అందరికి ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు.
ఈ రోజు (జూన్ మూడవ ఆదివారం) ఫాదర్స్ డే. సాధారణంగా చాలామంది వారి తండ్రితో దిగిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తమ జీవితానికి రక్షణగా ఉండి, నడక నేర్పిన నాన్నకు ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలబ్రిటీలు కూడా సామాజిక మాధ్యమాల్లో పంపించి ఆనందం పొందుతున్నారు. అలాగే సినిమా తారల ఫొటోలు కూడా వారి తండ్రులతో దిగినవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటో కూడా అలాంటిదే ఇది ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో, ప్రపంచ ఖ్యాతి గాంచిన హీరోది. అతనేనండీ.. పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ప్రభాస్ తెలుగు సినీపరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరో. మాస్, క్లాస్ అన్నిరకాల సినిమా పాత్రలలో నటించిన హీరో ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో దిగిన తన చిన్ననాటి ఫొటో తెగ వైరల్ అవుతుంది.
సోనారా స్మార్ట్ డాడ్ అనే లేడీ ‘ఫాదర్స్ డే’ను ప్రారంభించింది. ఆమె తల్లిని కోల్పోయి తండ్రి లాలనలో పెరిగింది. తండ్రి ప్రేమతోనే పెరిగి పెద్దదయ్యింది. అందుకే తండ్రి మనసులోని నిస్వార్థప్రేమ, అంకితభావాన్ని, తన కోసం తండ్రి చేసిన త్యాగాలకు గుర్తుగా ఒకరోజు ఉండాలనే భావంతో ఫాదర్స్ డే ను ప్రచారం స్టార్ట్ చేసింది. 1910లో అమెరికాలో మొదటిసారిగా జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డేను జరుపుకున్నారు. అప్పటినుండి ప్రతి ఏడాది జూన్ మూడో ఆదివారం ఫాదర్స్ డే ను జరుపుకుంటున్నారు.