ఈ మధ్యకాలంలో సినిమా తారల చిన్నప్పటి ఫొటోలు ఒక్కొక్కటికిగా బయటపడుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది హీరో, హీరోయిన్ల ఫొటోలు బయటపడి చివరికి కాస్త వైరల్ గా కూడా మారుతున్నాయి. ఇకపోతే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య మేహిక భర్త చిన్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోస్టు చేస్తూ అతనిపై ఉండే ప్రేమను రాసుకొచ్చింది. దీంతో ఆ ఫొటో క్షణాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక విషయానికొస్తే.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మూవీ దేవి పుత్రుడు మూవీ గుర్తుందా?
ఎందుకు గుర్తుండదు చెప్పండి.. అందరికీ గుర్తే ఉంటుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలైంది. కానీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన చిన్నారిని ఎవరూ మర్చిపోలేరు. తన నటనతో బాగా ఆకటుకున్న అందరినీ మైమరిచిపించింది. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వేగా తమోటియా ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
ఆమెను చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎం సంబంధం లేదన్నట్లుగా తయారైంది. తన చూడచక్కని రూపంతో వేగా తమోటియా అందరిని తన వైపుకు తిప్పుకుంటుంది. తన అందంతో కుర్రళ్ల మతిపోగొడుతూ చెమటలు పట్టిస్తుంది. ఇకపోతే గతంలో వేగా తమోటియా హీరో వరుణ్ సందేష్ తో కలిసి హ్యాహ్యాపీగా అనే సినిమాల్లో సైతం నటించింది. కానీ ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇదే సినిమానే కాకుండా గతంలో కొన్ని సినిమాల్లో నటించింది ఈ యంగ్ బ్యూటీ వేగా తమోటియా. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా గతంలో మంచి మంచి పాత్రలు చేసిన ఈ బామ మంచి అవకాశాలు వస్తే త్వరలో తప్పకుండా సినిమాల్లో నటిస్తానని తెలిపింది. ప్రస్తుతం వేగా తమోటియా చదువుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.